E-Paper
Advertisement

తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?
Advertisement

AP Power Restoration: తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ థ్యాంక్స్ చెప్పింది. ఆర్నబ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడంలో అందించిన సాయానికి గాను కృతజ్ఞతలు తెలిపింది. మరి ముఖ్యంగా విద్యుత్ సంస్థల అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది అందించిన సహకారంపై ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

ఏపీలో ఆర్నబ్ తుఫాను సృష్టించిన సవాళ్లను అధిగమించి విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ అందించిన సహకారం అభినందనీయమని ఏపీఈపీడీసీఎల్‌ ప్రశంసించింది. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి పునరుద్ధరణ పనుల్లో కీలకంగా వ్యవహరించారని పేర్కొంది.

Advertisement

Also Read: అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించి ప్రజల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపాలనే లక్ష్యంతో అందించిన సేవలు మరువలేనివని కొనియాడింది. రాష్ట్ర సరిహద్దులకు అతీతంగా పొరుగు రాష్ట్ర ప్రజల కష్టాలను తమ బాధ్యతగా భావించి సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని పేర్కొంది. ఆపద సమయంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులు అడ్డుకాకుండా మానవీయత, పరస్పర సహకారానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయడం ప్రశంసనీయమని తెలిపింది.

Advertisement

ఇటీవల ఏపీపై విరుచుకుపడ్డ అర్నబ్ తుఫాన్ కారణంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు భారీ నష్టం కలిగించింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంచనా ప్రకారం.. సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ పార్మర్లు దెబ్బతిన్నాయి. ఒక్క విద్యుత్ కు సంబంధించే రూ.500 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ సాయం కోరింది. తద్వారా అత్యంత వేగంగా విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్దరించింది.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode November 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: షాపింగ్‌ మాల్‌లో పార్థు కోసం వెతుకుతున్న మనోహరి

Tags

Related News

ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!

ఇచ్చాపురంలో వైసీపీ ఘోర పరాజయం.. ఓటమికి అసలు కారణం అదేనా..?

విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్.. వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!

12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఏపీలో రూ.1.20 లక్షల కోట్లతో రహదారి ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Big Stories

Advertisement
×