E-Paper
Advertisement

నోవాటెల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్.. సీఎం రేవంత్, మంత్రులతో రాహుల్ భేటి.. టిఫిన్ చేస్తూనే రాజకీయాలపై ఆరా!

నోవాటెల్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పాలిటిక్స్.. సీఎం రేవంత్, మంత్రులతో రాహుల్ భేటి.. టిఫిన్ చేస్తూనే రాజకీయాలపై ఆరా!
Advertisement

Novotel Hotel Meeting: హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలతో కలిసి అల్పాహారం (టిఫిన్) చేస్తూనే రాహుల్ గాంధీ రాష్ట్ర వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమ్మిట్ నిర్వహణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్న రాహుల్.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి కావడంతో ఆయన విగ్రహానికి నివాళులర్పించే అంశంపై సమావేశంలో రాహుల్ చర్చించారు. నగరంలో నెహ్రూ విగ్రహం ఎక్కడ ఉందని ఆయన అడగగా ప్రస్తుతం జరగబోయే సభ వేదికకు అది చాలా దూరంలో ఉందని నేతలు బదులిచ్చారు. దీంతో తాను పాల్గొనబోయే గిగ్ వర్కర్స్ సమావేశ వేదికపైనే నెహ్రూ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు.

Advertisement

Also Read: దేశంలో ఫాసిస్ట్ పాలన.. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర.. మహేష్ గౌడ్, కోమటిరెడ్డి ఫైర్!

రాష్ట్ర నేతలతో సమావేశం ముగియడంతో రాహుల్ గాంధీ తదుపరి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. భారత్ సమ్మిట్ 2.0 సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులతో ఆయన భేటి అయ్యారు. ఈ భేటిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఈ భేటి అనంతరం అనంతరం ఆయన శిల్పారామం చేరుకుని అక్కడ గిగ్ వర్కర్స్‌తో కలిసి నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. చివరగా జయభేరి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో గిగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక సంక్షేమ పథకాన్ని ప్రారంభిస్తారు.

Advertisement

Also Read: ‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

Tags

Related News

దేశంలో ఫాసిస్ట్ పాలన.. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర.. మహేష్ గౌడ్, కోమటిరెడ్డి ఫైర్!

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

విదేశీ ప్రతినిధుల వీసాల రద్దుపై రాజకీయ దుమారం.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్!

ఇక మీరు మారరా.. తెలంగాణ బీజేపీ నేతలపై భగ్గుమన్న హైకమాండ్!

దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.. ప్రతి ఇంటికి రూ.5 లక్షల భరోసా.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×