BigTV English

Bajrang Punia: డోప్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు..!

Bajrang Punia: డోప్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు..!

NADA suspends Bajrang Punia(Sports news headlines): 2024లో జరగబోయే పారిస్ ఒలంపిక్స్‌కు సన్నద్ధమవుతోన్న రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు షాక్ ఎదురైంది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA)కు బజరంగ్ డోపింగ్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ చర్య ఈ ఏడాది చివర్లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అతని ప్రయత్నాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.


ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులందరికీ NADA డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోంది. కాగా మార్చి 10న సోనెపట్‌లో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ కోసం పునియా తన మూత్ర నమూనాను అందించడంలో విఫలమయ్యాడు, దీనితో భవిష్యత్తులో జరిగే ఈవెంట్‌లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తూ NADA ఆర్డర్ జారీ చేసింది.

పునియా, ఒలింపియన్లు సాక్షి మాలిక్, వినేష్‌లతో సహా ఇతర అగ్రశ్రేణి రెజ్లర్‌లతో పాటు; బీజేపీ మాజీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ముందు వరుసలో ఉన్నారు.


Also Read: ఐపీఎల్ 2024.. ఈ ఏడాది వివాదాస్పద అంపైరింగ్ సంఘటనలు.. ఓ లుక్కేయండి!

టోక్యో ఒలంపిక్స్‌లో భారత్‌కు కాంస్య పథకాన్ని అందించిన బజరంగ్ పునియా పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. కాగా ఈ నెలాఖరులో జరగనున్న సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకుండా అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. 65 కేజీల విభాగంలో ఇప్పటి వరకు ఏ భారతీయుడు కూడా ఒలింపిక్ కోటాను గెలుచుకోలేదు. మే 9న ఇస్తాంబుల్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ క్వాలిఫయర్స్‌లో సుజీత్ కల్కల్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.

 

Tags

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×