BigTV English

Rahul Gandhi Speech: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. రాహుల్ హామీ..

Rahul Gandhi Speech: ఇందిరమ్మ ఇళ్ల పథకం.. రాహుల్ హామీ..
Rahul Gandhi in Vijayabheri Meeting

Rahul Gandhi in Vijayabheri Meeting(Political news in telangana) :

హైదరాబాద్ తుక్కుగూడ విజయభేరి బహిరంగ సభ వేదికగా రాహుల్ గాంధీ కీలకమైన హామీని ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక వరాలు ప్రకటించారు. వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.


బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తోపాటు బీజేపీ, ఎంఐఎంలతోనూ కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ఒకే ఎజెండాతో పని చేస్తున్నాయని ఆరోపించారు.

కేంద్ర పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాగు చట్టాల బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు తెలియాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ మీటింగ్ ను అడ్డుకోవాలని చూశారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.


కేసీఆర్, ఎంఐఎం నేతలపై కేసులు లేవని రాహుల్ గాంధీ అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ కాంగ్రెస్ నేతల వెంటే పడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ , ఒవైసీ.. బీజేపీకి మద్దతుదారులని ఆరోపించారు. అందుకే వారిపై కేసులు పెట్టడంలేదన్నారు.

కేసీఆర్ కుటుంబ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని రాహుల్ గాంధీ వివరించారు. పేదలు, రైతులు, కార్మికుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. కానీ వారెవరికి ప్రయోజనం దక్కలేదన్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×