Rahul Gandhi: ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు.
‘నిన్న కశ్మీర్ కు వెళ్లడంతో సమ్మిట్ కు రాలేకపోయా. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. పదేళ్ల క్రితం ఉన్న రాజకీయాలకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. పాత తరం రాజకీయం అంతరించిపోయింది. ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోంది. చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావడం లేదు. భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ప్రజల సమస్యలు వినడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రేమతో ప్రజలను నేరుగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నాను. విపక్ష పార్టీలు ప్రపంచవ్యాప్తంగా అణిచివేతను ఎదుర్కొంటున్నాయి. విపక్షాల వాన వినిపించేందుకు.. కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాశ్మీర్ ఉగ్రదాడి ఘటనను గుర్తు చేస్తూ ఉపన్యాసం ప్రారంభించిన రాహుల్ గాంధీ..
నిన్ననే భారత్ సమ్మిట్ కు రావల్సి ఉంది
కానీ కాశ్మీర్ వెళ్లి పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను పరామర్శించాను.. అందుకే రాలేకపోయాను
బాధితులకు అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు
– రాహుల్ గాంధీ pic.twitter.com/ZjFXqcYbXi
— BIG TV Breaking News (@bigtvtelugu) April 26, 2025
‘దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గం చూపిస్తున్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గంలోనే వెళ్లాలి. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలు నాపై ఎంతో ప్రేమ చూపించారు. సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో పాలకులు, రాజకీయ నాయకులు ప్రజల అభిప్రాయాలను, సమస్యలను సంపూర్ణంగా తెలుసుకోలేక పోతున్నారు. దేశంలో నూతన రాజకీయాలకు, నూతన ఆలోచనలకు ఈ సమ్మిట్ వేదిక అయినందుకు సంతోషంగా ఉంది’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ALSO READ: CM Chandrababu Naidu: ఏపీలో మరో కొత్త పథకం అమలు.. వారి అకౌంట్లలో రూ.20,000
ALSO READ: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం