E-Paper
Advertisement

CM Chandrababu Naidu: ఏపీలో మరో కొత్త పథకం అమలు.. వారందరికీ రూ.20,000

CM Chandrababu Naidu: ఏపీలో మరో కొత్త పథకం అమలు.. వారందరికీ రూ.20,000
Advertisement

CM Chandrababu Naidu: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ స్కీం కింద మత్స్యకారుల కుటుంబాలకు 20వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ పథకం వల్ల మొత్తం లక్షా 29వేల 178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

మత్స్యకారులకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

Advertisement

‘మత్స్యకారులను ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో దశదిశ మారింది. నేను ఊహించిన దాని కన్నా మీ సమస్యలున్నాయి. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసింది. ఆ డబ్బును ఏం చేసిందో లెక్కలు లేవు. ఆ సమస్యలు ఎలా ఉన్నా.. మిమ్మిల్ని ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వ ఫిష్ ఆంధ్ర అని చెప్పింది. రూ.300 కోట్ల ఖర్చు పెట్టింది. కానీ ఎవరి జీవితాలు మారలేదు. మత్స్యకారులకు కూటమి సర్కారు ఎళ్లవేళలా అండగా ఉంటుంది.’ అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Advertisement

రూ.283కోట్ల మత్స్యకార భృతి అందజేస్తున్నాం: అచ్చెన్నాయుడు

కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు. వారికి వైసీపీ ప్రభుత్వం కనీసం వలలు కూడా ఇవ్వలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్న హామీలు అమలు చేస్తున్నాం. రూ.283 కోట్ల మత్స్యకార భృతి అందజేస్తున్నాం. మూలపేట పోర్ట్ ను అభివృద్ది చేస్తాం’ అని అన్నారు.

ALSO READ: NPCIL Jobs: ఇది సువర్ణవకాశం.. ఇంటర్వ్యూతో ఉద్యోగ అవకాశం.. భారీ జీతం, ఇంకా 4 రోజులే మిత్రమా..

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×