BigTV English
Advertisement

Nc24 : పర్ఫెక్ట్ పాన్ ఇండియా మెటీరియల్, నాగచైతన్య కెరియర్ లో నెవర్ బిఫోర్

Nc24 : పర్ఫెక్ట్ పాన్ ఇండియా మెటీరియల్, నాగచైతన్య కెరియర్ లో నెవర్ బిఫోర్

Nc24 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో కార్తీక్ దండు ఒకరు. ముందు రచయితగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత భమ్ బోలేనాథ్  సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు కార్తీక్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత దర్శకుడుగా చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చిన కార్తీక్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. విరూపాక్ష సినిమాకు ముందు కార్తీక్ దండు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాడు. దాదాపు చనిపోతాడు అనుకునే స్థాయికి కూడా వెళ్ళాడు అని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఒక సందర్భంలో తెలిపారు. ఆ తర్వాత విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేసి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. కేవలం తను మాత్రమే కాకుండా సాయి తేజ్ కు కూడా ఈ సినిమా విపరీతంగా కలిసి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.


ఆసక్తికరమైన కథలు

కార్తీక్ దండు కథ రాసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. తాను రచయితగా పనిచేసిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విరూపాక్ష సినిమా చూసిన తర్వాత కార్తికేయ సినిమాలో కార్తీక్ దండు ఇన్వాల్వ్మెంట్ ఎంతుంది అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కార్తీక్ దండు నాగచైతన్య తో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లో 24వ సినిమాగా వస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా ఒక మైథిలాజికల్ థ్రిల్లర్.


Also Read : Trisha : వాళ్ళ ముగ్గురితో పని పనిచేయాలనుకున్నాను.. ఇన్నాళ్లకు కల నిజమైంది

ఎక్స్కవేషన్ బిగిన్స్

ఇక తాజాగా ఈ సినిమా సంబంధించి “ది ఎక్స్కవేషన్ బిగిన్స్” అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ సినిమా కోసం చేసిన ప్రిపరేషన్ మొత్తం కనిపిస్తుంది. అద్భుతమైన లొకేషన్స్, పని జరుగుతున్న ఆర్ట్, అలానే విఎఫ్ఎక్స్ వర్క్, నాగచైతన్య స్టైల్ వీటన్నిటిని కూడా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో చూపిస్తూ క్యూరియాసిటీ మరింత పెంచారు. ఇక ఈ వీడియో చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని ఈజీగా అర్థమవుతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాకు మాత్రమే పరిమితమైన నాగచైతన్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించనున్నాడు. ముఖ్యంగా ఈ వీడియో అంతటిలో అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×