E-Paper
Advertisement

Rahul Gandhi speech : ఆ హామీలన్నీ అమలు చేస్తాం.. కొల్లాపూర్ సభలో రాహుల్ భరోసా..

Rahul Gandhi speech : ఆ హామీలన్నీ అమలు చేస్తాం..  కొల్లాపూర్ సభలో రాహుల్ భరోసా..
Advertisement
Rahul Gandhi latest news

Rahul Gandhi latest news(Political news in telangana):

కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరి ప్రజాభేరి బహిరంగ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే గ్యాస్‌ సిలిండ్‌ కేవలం రూ.500కే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రైతు భరోసా కింద రైతులకు రూ. 15 వేలు అందిస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు.

సీఈసీ కీలక భేటీ ఉన్నా ఇక్కడికి వచ్చానన్నారు రాహుల్‌ గాంధీ. తెలంగాణలో ఒకవైపు సీఎం కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. మరోవైపు తెలంగాణ సమాజం, నిరుద్యోగులు, మహిళలున్నారని తెలిపారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేశాయని విమర్శించారు.రూ. లక్షల కోట్ల సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలతో తనకు ఉన్నది రాజకీయ అనుబంధం కాదని కుటుంబ అనుబంధమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రియాంక అనారోగ్యంతో ఉండటం వల్లే తాను ఇక్కడకి వచ్చానని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రజల తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×