BigTV English

Raids on Tonique Liquor Group: టానిక్ లిక్కర్ గ్రూప్‌పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Raids on Tonique Liquor Group: టానిక్ లిక్కర్ గ్రూప్‌పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Raids on Tonique Liquor GroupRaids on Tonique Liquor Group(TS news updates): టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారులు చేపట్టిన జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు.


తెలంగాణలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా టానిక్ వైన్ షాప్‌కి రాష్ట్రంలో ఏ డిపో నుంచి అయినా మద్యం తీసుకునే ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం ఇచ్చింది.

ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ వైన్ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇచ్చింది.


ఒక్క ఎలైట్ వైన్ షాప్ లైసెన్స్ తో టానిక్ వైన్ షాప్ 11 షాపులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఏడేళ్ల నుంచి టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. ఇందులో ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారి తో పాటు ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించారు.

Read More: బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల విధ్వంసం.. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్..

ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్ వెనుక గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలోని ముఖ్య నేతలు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఏడేళ్ల పాటు మద్యం విక్రయాల లెక్క తీస్తే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టారో బయట పడుతుందని జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు.

అయితే తాము నిబంధనలకు లోబడే వ్యాపారం నిర్వహిస్తున్నట్టు టానిక్‌ సంస్థ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చింది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×