BigTV English

Mallikarjun Kharge: ‘రైల్వే ప్రమాదాలు నివారించండి.. వెంటనే కవచ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయండి’

Mallikarjun Kharge: ‘రైల్వే ప్రమాదాలు నివారించండి.. వెంటనే కవచ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయండి’

Mallikarjun Kharge| ఉత్తర్ ప్రదేశ్ లోని గోండాలో గురువారం జరిగిన చండీగడ్ – దిబ్రుగడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. చాలామందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ నవ్.. రైల్వే ప్రమాదాలకు పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు.


”చండీగడ్ – దిబ్రుగడ్ ఎక్స్ ప్రెస్ రైలు.. ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పిన ప్రమాదం.. ఒక్కటే కాదు.. ఇటీవల రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. మోదీ ప్రభుత్వం రైల్వే శాఖ భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం” అని ఖర్గే సోషల్ మీడియాలో అధికారికంగా పోస్టు చేశారు.

Thief Returns Loot: ‘మీ ఇల్లు అని తెలీక దొంగతనం చేశాను.. సారీ’.. లెటర్ రాసి సొమ్మును తిరిగి ఇచ్చేసిన విచిత్ర దొంగ!


“ఒక నెల క్రితమే.. సీల్ దా – అగర్ తలా కంచన్‌జంగా ఎక్సెప్రెస్ ఒక గూడ్స్ రైలుతో ఢీ కొనడంతో 11 మంది చనిపోయారు. దీనిపై రైల్వే భద్రతా కమిషనర్.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పారు. కానీ విచారణ రిపోర్టు ప్రకారం… ఆటోమేటిక్ సిగ్నల్స్ విఫలం కావడం, మల్టిపుల్ లెవెల్ ఆపరేషన్స్ జాప్యం జరగడం, ట్రైన్ మెనేజర్, లోకొ పైలట్ వద్ద వాకీ టాకీ లాంటి సరైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్ లేకపోవడమే కారణాలని తెలిసింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు,” అని ఖర్గే మండిపడ్డారు.

”ప్రధాని నరేంద్ర మోదీ, అతని రైల్వే మంత్రి.. ఇద్దరూ తాము చేసిన గొప్పలని చెప్పుకోవడానికి ఏ చిన్న అవకాశం కూడా వదలరు. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాలకు వారు నేరుగా బాధ్యత వహిస్తారా?,” అని ప్రశ్నించారు.

ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి వెంటనే రైల్వే శాఖలో కవచ్ యాంటీ కొలిజన్ టెక్నాలజీని మెరుగైన భద్రత కోసం ఉపయోగించడం మొదలుపెట్టాలని ఖర్గే సూచించారు.

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×