BigTV English

National:అభివృద్ధికి అంతం ఉండదు: మోహన్ భగవత్

National:అభివృద్ధికి అంతం ఉండదు: మోహన్ భగవత్

RSS chief Mohan Bhagavath spoks with cader about unity in diversity
దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయని..అభివృద్ధికి అంతం అనేది ఉండదు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. వికాస్ భారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ణండ్ లోని గుమ్లాలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడారు. దేశ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని సూచించారు. మన దేశంలో 33 కోట్లకు పైగా దేవుళ్లు ఉన్నారు. అలాగే వివిధ భాషలు మాట్లాడే జనం ఉన్నారు. వేషభాషలు వేరైనా, తినే ఆహారపు అలవాట్లు వేరైనా అందరూ ఒకే దేశం గొడుగులో సురక్షితంగా ఉంటున్నామని..జాతీయ సమైఖ్యతకు ఇది నిదర్శనమని అన్నారు. ఇలాంటి వ్యవస్థ కేవలం భారతదేశానికే సొంతమని..మరే ఇతర దేశానికీ లేదని ..అలాంటి ఈ పుణ్యభూమిలో పుట్టడం మన అదృష్టమని అన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తి ఎదగాలని కోరుకుంటాడని అన్నారు. ఈ ఎదిగే క్రమంలో జననం నుంచి మరణం దాకా ఎదిగేందుకే ప్రయత్నిస్తుంటాడని..ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. అలాగే దేశాభివృద్ధి, ప్రగతి కూడా నిరంతర ప్రక్రియే అని అన్నారు. అందుకే ఇక్కడ మూడు వేల ఎనిమిది వందలకు పైగా విభిన్న భాషలు మాట్లాడే వారు ఉన్నా..వారి లక్క్ష్ం ఒకటే దేశాభివృద్ధి అని అన్నారు.


భిన్నత్వంలో ఏకత్వం

వ్యక్తిగతంగా తాను దేశాభివృద్ధినే ఎన్నడూ కోరుకుంటానని..ఈ క్రమంలో దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందలేదని అన్నారు. అభివృద్ధికి సహకరించే శక్తులతో కలిసి ప్రయాణం కొనసాగించానని అన్నారు. తద్వారా తాను ఆశించిన ఫలితాలు వచ్చాయని అన్నారు. ఏనాటికైనా దేశ సమగ్రతను కాపాడగలిగేది ఐకమత్యమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని అన్నారు. సోదర భావంతో సౌభ్రాతృత్వంతో పనిచేయాలని భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఉండాలని కార్యకర్తలకు మోహన్ భతవత్ తెలిపారు.


Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×