Weather News: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఎండలు తీవ్రమయ్యాయి. కేవలం సిటీ వాసులకే కాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రజలు రోడ్లపైకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పగల ప్రభావం రాత్రిపై పడింది. ఇంట్లోకి వెళ్తే చాలా ఒకటే ఉక్కుపోత. తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణ మూడురోజుల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండతో అల్లాడిపోతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం.
తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు
ఏపీ, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం నాడు తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మే రెండు శుక్రవారం రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీయనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంగా వీచే అవకాశముంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఏపీలో కూడా, కాకపోతే
ఏపీ విషయానికి వద్దాం. ఉదయం వేళ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చు. చీరాల, ఒంగోలు, నంద్యాల ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతున్నమాట. గురువారం ఉమ్మడి గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. దక్షిణ రాయలసీమలో జల్లులకు పడే అవకాశముంది. శుక్రవారం కూడా ఇదే తరహా వాతావరణ ఉండనుంది. బుధవారం నాడు రాయలసీమలో ఎండలు 42 డిగ్రీలు దాటగా, కోస్తాంధ్రాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి.
ALSO READ: ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన కలెక్టర్, ఆ విద్యార్థి ఫుల్ హ్యాపీ
అక్కడక్కడా వాన పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో పగటి ఉష్టోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. పలు జిల్లాల్లో అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కాకపోతే రాత్రి వేళ వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. ఒకవిధంగా చెప్పాలంటే కాస్త రిలీఫ్ అన్నమాట.