Sam Curran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బుధవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ అలాగే ప్రభ సిమ్రాన్ ఇద్దరు అద్భుతంగా ఆడడంతో పంజాబ్ కింగ్స్ అవలీలగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ (Sam Curran) చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ప్రీతి జింటా పరువు తీసిన సామ్ కర్రన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కర్రన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పంజాబ్ కింగ్స్ జట్టు పైన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సామ్ కర్రన్ … 47 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నారు. 187 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు సామ్ కర్రన్. అయితే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత… సామ్ కర్రన్ ఫోన్ కాల్ సెలబ్రేషన్స్ చేసుకొని హాట్ టాపిక్ అయ్యారు.
పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటాకు చురకలు అంటించేలా…. సామ్ కర్రన్ ఈ ఫోన్ కాల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో…. పంజాబ్ కింగ్స్ జట్టులో కొనసాగాడు సామ్ కర్రన్. అంతేకాదు శిఖర్ ధావన్ గాయంతో జట్టు నుంచి దూరం కావడంతో అతనికి కెప్టెన్సీ కూడా ఇచ్చింది ప్రీతి జింటా. కానీ రిజల్ట్ మాత్రం పెద్దగా రాలేదు. దీంతో మొన్న జరిగిన మెగా వేలంలో సామ్ కర్రన్ ను జట్టులోంచి తీసేసింది పంజాబ్ కింగ్స్.
అయితే ఆ పగను పెంచుకున్న సామ్ కర్రన్… బుధవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ అయితే గెలవలేదు కానీ ఆ జట్టుపై వీరోచిత పోరాటం చేశాడు సామ్ కర్రన్. 47 బంతుల్లోనే 88 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక తన హాఫ్ సెంచరీ అయిన తర్వాత ప్రీతి జింటా ( Preity Zinta ) వైపు చూస్తూ… ఫోన్ కాల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు సామ్ కర్రన్. దీంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు స్టేడియంలో సైలెంట్ అయిపోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…సామ్ కర్రన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. తనను కాదన్న జట్టుపై అద్భుతంగా రానించి తానేంటో నిరూపించుకున్నాడని కొనియాడుతున్నారు. సామ్ కర్రన్ సెంచరీ మిస్ చేసుకుని మ్యాచ్ ఓడిపోయిన… సరే పంజాబ్ కు మాత్రం తగిన బుద్ధి చెప్పాడని మరి కొంతమంది క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Just look at the Celebration
Bro choosed a perfect day to perform
– against His Ex team PBKS ( which he captained)
– Whole CSK was falling
– Sam came and Sam conquered.Much much Appreciation for Sam Curran.#CSKvsPBKSpic.twitter.com/0PUg1Dk92X
— HomeLander_Raj (@RajHomelander) April 30, 2025