Big Stories

Rains : హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం.. తెలంగాణలో మరో 3రోజులపాటు వానలు..

Rains : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆమధ్య కురిసిన అకాల వర్షాల తర్వాత.. ఎండలు పెరిగిపోయాయి. కొన్నిరోజులుగా నగరంలో దాదాపు 40 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఇప్పుడు వర్షం కురవడంతో సిటిజన్లు ఉపశమనం పొందుతున్నారు.

- Advertisement -

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి అమీర్ పేట, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షం దంచికొట్టింది. పాతబస్తీలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. అంబర్ పేట, శేరిలింగంపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

- Advertisement -

ఈదురు గాలుల ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్స్ ఎగిరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వానలు పడతాయని వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News