Big Stories

Avinash Reddy : కర్నూలుకు సీబీఐ టీమ్.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా..?

Avinash Reddy : వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విషయంలో సీబీఐ తీసుకునే యాక్షన్ పై ఉత్కంఠ రేగుతోంది. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి సీబీఐ అధికారులు వెళ్లారు. జిల్లా ఎస్పీతో భేటీ అయ్యారు. దీంతో ఏం జరుగుతుందనే టెన్షన్ ఏర్పడింది.

- Advertisement -

ఇటీవల అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చిందని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ కారణంగానే ఈ నెల 19న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. 4 రోజులు నుంచి అవినాష్‌ రెడ్డి కర్నూలులోనే ఉంటున్నారు. దీంతో ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. అయితే తాను సోమవారం విచారణకు రాలేనంటూ అధికారులకు కడప ఎంపీ లేఖ రాశారు. తన తల్లి కోలుకోవడానికి మరో 10 రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులే ఆసుపత్రికి చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16న కూడా సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరకాలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్నాయంటూ సీబీఐకు సమాచారం అందించి ఆరోజు హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లిపోయారు.

- Advertisement -

మరోవైపు అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసుప్రతి పరిసరాల్లో పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రికి భారీగా చేరుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

ఆదివారం రాత్రి కర్నూలులో ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. విశ్వభారతి ఆసుపత్రి వద్ద మీడియా ప్రతినిధులపై దాడులకు ప్రయత్నించారు. కొందరు మీడియా ప్రతినిధుల చేతుల్లోని కెమెరాలు లాక్కొని ధ్వంసం చేశారు. ఆ వీధిలోకి ఇతర వ్యక్తులను ప్రవేశించకుండా అడ్డుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News