Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన స్కీమ్ రాజీవ్ యువ వికాసం. సోమవారం అంటే జూన్ 2న ఎంపికైన లబ్దిదారులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మొదటి లిస్టు దాదాపుగా ఫైనల్ అయ్యింది.
ఈ పథకం కింద ఇప్పటివరకు 16 లక్షల పైచిలుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆయా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. తొలి విడతగా లక్ష మందికి 50 వేల నుంచి లక్ష రూపాయల విలువ గల యూనిట్లకు సంబంధించి ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు రెడీ అయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జూన్ రెండు(సోమవారం) ఆయా పత్రాలను లబ్దిదారులకు ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 2 నుంచి 9 వరకు వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలన్నది అధికారుల మాట. జూన్ 10 నుంచి 15 వరకు ఎంపికైన లబ్దిదారులకు ట్రైనింగ్ ఉండనుంది.
జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ స్కీమ్ కోసం హైదరాబాద్ నుంచి లక్షా 28 వేల 763 దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకర్లకు అందజేయడం, వారు పూర్తి చేయడం దాదాపుగా జరిగిపోయింది.అలానే 2 లక్షల లోపు వారికి జులైలో లోన్లు అందజేయనుంది.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక అప్ డేట్స్.. 5న సిట్ ముందుకు ప్రభాకర్‌రావు
రూ.2 నుంచి 4 లక్షల వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ లబ్దిదారులకు లోన్లు అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు. తొలి విడతా జాబితాలో హైదరాబాద్ నుంచి 9 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరిలో 3 వేల 721మంది 50 వేల రుణాలు మంజూరు చేయనున్నారు. మిగతా 5 వేల పైచిలుకు లబ్దిదారులకు లక్ష లోన్లు అందజేస్తారు.
వీరందరికీ జూన్ 2న డబ్బులు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం మాట.మిగతా దరఖాస్తులు లక్ష విలువకు మించినవి కావడంతో విడతల వారీగా శాంక్షన్ చేయనున్నాయి బ్యాంకర్లు. లక్ష స్కీమ్‌కు 10 వేలు మాత్రమే బ్యాంక్‌లోన్ ఇవ్వనుంది. మిగతా 90 వేలు ప్రభుత్వం సబ్సిడీగా అందించనుంది. నిజామాబాద్ జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద 22,120 యూనిట్లకు 59,027 మందికి అప్లై చేసుకున్నారు.
వారిలో 7,539 అప్లికేషన్లు ఈనెలలో (జూన్) పరిష్కారం కానున్నాయి. మిగతా లక్షకు మించినవారి స్కీమ్ కు సంబంధించి 51,488 అప్లికేషన్లను విడతల మంజూరు చేయనున్నారు. ఆయా స్కీమ్‌కు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ప్రొగ్రామ్ ఫిక్స్‌చేశారు. నిరుద్యోగుల బ్యాంక్ సిబిల్ స్కోర్ ఆధారంగా చేసుకొని వాటిని మంజూరు చేశారు.