Russia Train Accident: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న రష్యాలో మరో ఘోర దుర్ఘటన జరిగింది. రైల్వే వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో లోకో పైలెట్ సహా పలువురు దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో ఘటన
రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. వంతెన దాటుతున్న సమయంలో కూలిపోవడంతో రైలు పట్టాలు తప్పి అమాంతం కింద పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. వారిలో లోకో పైలెట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. మరో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ రైలు వైగోనిచ్స్ క్ జిల్లాలో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. మాస్కో నుంచి క్లిమోవ్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ఇంతకీ వంతెన ఎలా కూలింది?
ఉక్రెయిన్, రష్యా మధ్యలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు సమీపంలో ఉన్న రైల్వే వంతెన కూలడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వంతెనను ఉద్దేశపూర్వకంగా పేల్చివేసి ఉండవచ్చని రష్యా అధికారులు భావిస్తున్నారు. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సంఘటనకు సంబంధించి ప్రభుత్వ సంస్థలు షేర్ చేసిన ఫోటోలు కూలిపోయిన వంతెన మీది నుంచి రైలు పడిపోయి కాంట్రీట్ ముక్కల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను వంతెన దాటడానికి కొన్ని క్షణాల ముందు ఈ ఘటన జరిగినట్లు అర్థం అవుతోంది. మూడు సంవత్సరాల క్రితం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. బ్రయాన్స్క్‌తో సహా దాని సరిహద్దు ప్రాంతాలు పదేపదే డ్రోన్ దాడులు, మిసైల్ దాడుల కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వంతెన బలహీనమై కూలిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను అధికారులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
🚨 BREAKING: Bridge COLLAPSES on Passenger Train in Russia’s Bryansk — Explosion Confirmed Civilians Crushed 🚨
Absolute devastation unfolds in Russia’s Bryansk region as a civilian passenger train is catastrophically struck by a collapsing bridge — reportedly triggered by an… pic.twitter.com/rarzh9J94J
— PatriotJosh (@Patriot_Josh11) May 31, 2025
Read Also: దేశాలు, ఖండాలను కలిపే వంతెనలు.. ఈ సరిహద్దులు భలే ఉంటాయ్ బాసు!
వచ్చేవారం ఇరు దేశాల మధ్య రెండో దఫా చర్చలు
మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు శాంతి చర్చలకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి. ఇస్తాంబుల్ లో ఉక్రేనియన్ అధికారులతో రెండవ దశ చర్చలు జరిపేందుకు రష్యా అధికారులు సిద్ధం అవుతున్నారు. ఘర్షణను వదిలి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్కో, కైవ్ అధినేతలకు సూచించారు. ఉక్రేనియన్ అధికారులు ఇప్పటి వరకు రెండో దశ చర్చల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: తిరుగుతూ డబ్బులు సంపాదించే ఉపాయం.. ట్రావెలింగ్‌తో లక్షల్లో ఆదాయం!