Woman Cheats Age| ఒక 26 ఏళ్ల యువకుడు తన ప్రేయసి గురించి ఒక రహస్యం తెలుసుకుని షాక్ అయ్యాడు. నాలుగు సంవత్సరాలుగా ఆమె తన వయసు 27 అని చెప్పింది, కానీ వాస్తవంగా ఆమె వయసు 48 సంవత్సరాలు. ఈ షాకింగ్ నిజం తెలిసిన ఆ యువకుడు తన బాధను రెడ్డిట్ అనే సోషల్ మీడియా వేదికలో పంచుకున్నాడు. ఆమె తన పుట్టిన సంవత్సరం 1998 అని చెప్పింది, కానీ ఆమె ల్యాప్‌టాప్‌లో రహస్యంగా దాచిన ఆమె పాస్‌పోర్ట్ ఫోటో చూసినప్పుడు, ఆమె 1977లో జన్మించినట్లు తెలిసింది.
ఈ యువకుడు రెడ్డిట్‌లోని బ్రేకప్స్ సబ్‌రెడ్డిట్‌లో ఇలా రాశాడు: “నేను నా ప్రేయసితో నాలుగేళ్లుగా సంబంధంలో ఉన్నాను. ఆమె ఎప్పుడూ తన పుట్టిన సంవత్సరం 1998 అని చెప్పింది. కానీ ఆమె ల్యాప్‌టాప్‌లో పాస్‌పోర్ట్ ఫోటో చూసినప్పుడు, ఆమె నిజంగా 1977లో జన్మించిందని తెలిసింది.”
ఈ నాలుగేళ్ల కాలంలో అతనికి ఆమెపై ఎటువంటి అనుమానం రాలేదు. ఎందుకంటే ఆమె 50 ఏళ్ల వయసు దగ్గరవుతున్నా.. అలాంటి వ్యక్తిలా కాకుండా 27 ఏళ్ల వయసులో ఉన్నట్లు కనిపిస్తుందట. అయితే, ఆమె గురించి కొన్ని అనుమాస్పద విషయాలు ఉన్నాయని అతను అంగీకరించాడు. “మా ఇద్దరి మధ్య సంబంధంలో కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించాయి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది నా మొదటి దీర్ఘకాల లవ్ అఫైర్.” అని అతను రెడ్డిట్ లో చెప్పాడు. ఆమె తన లుక్స్ గురించి చాలా శ్రద్ధ వహించేది, పైగా ఆమె స్నేహితులందరూ 27 ఏళ్ల కంటే చాలా పెద్దవారు. అతను ఆమె పాస్‌పోర్ట్ లేదా గుర్తింపు కార్డు చూడాలని అడిగినప్పుడల్లా, ఆమె వివిధ సాకులు చెప్పి తప్పించుకునేది.
ఆమె ల్యాప్‌టాప్‌లో అతను ఒక గర్భం పాజిటివ్ టెస్ట్ ఫోటోను కూడా చూశాడు. అది వారు కలుసుకోవడానికి కొన్ని నెలల ముందు తీసింది. ఈ విషయం తెలిసి ఆ యువకుడు ఆమె తనను మోసం చేసినట్లు ఫీల్ అయి బాధతో ఈ పోస్ట్‌లు పెట్టాడు.
సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత.. వందలాది కామెంట్లు వచ్చాయి. చాలామంది ఈ సంబంధాన్ని ముగించమని సలహా ఇచ్చారు, ఎందుకంటే ఇది అబద్ధాలపై నడిచింది. ఒక రెడ్డిట్ యూజర్ ఇలా రాశాడు. “ఒకవేళ ఇది నిజమైతే, విడిపో. ఆమె నీకు నిరంతరం అబద్ధం చెప్పింది. ఆమె ఇంకా ఏమేం దాచి ఉందో ఎవరికి తెలుసు?”. మరో యూజర్ అభిప్రాయం ఇలా వ్యక్తం చేశాడు. “మీ రిలేషన్ ఒక నాలుగేళ్ల అబద్ధం. అంటే నీవు ఆమెను ఎప్పటికీ జీవితంలో నమ్మలేవని చూపిస్తుంది. ఆమె ఇంకా ఏమేమి మోసం చేయగలదో?” మరొకరు యూజర్ అయితే ఇది చాలా డేంజరస్ అని రాశాడు. “ఇది నిజంగా భయంకరం. ఇది నిజమైతే, ఆమె మానసికంగా సమస్యలు ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంది. నాలుగేళ్లపాటు ఇలా మోసం చేయడం చాలా దారుణం.”
Also Read: సిగరెట్‌తో పాటు టీ తాగుతున్నారా?.. ఆరోగ్యానికి చాలా హానికరం జాగ్రత్త.. ఎందుకంటే?
కొంతమంది ఈ యువకుడి రెడ్డిట్ ప్రొఫైల్‌లో ఆమె ఫోటో చూసి, ఆమె 27 ఏళ్లలాగా కనిపించడంతో అతని మాటలను నమ్మారు. ఒక యూజర్ ఆమె ఎలాంటి సాకులు చెప్పిందని అడిగినప్పుడు.. అతను ఇలా సమాధానమిచ్చాడు: “ఆమెకు కష్టమైన గతం ఉంది. తన తల్లిదండ్రులు తనను పెంచడానికి ఇష్టపడలేదని, తన తాతయ్య వద్ద పెరిగానని చెప్పింది. తన కుటుంబం గురించి చాలా తక్కువ సమాచారం ఇచ్చేది. తన కుటుంబ ఫోటోలు చూపించమని అడిగినప్పుడు, తనకు ఎవరూ లేరని చెప్పేది.”
గర్భం టెస్ట్ ఫోటో గురించి అతను ఇలా చెప్పాడు.. “ఆ ఫోటో మేము కలుసుకోవడానికి రెండు నెలల ముందు తీసినది. దాని గురించి నాకు ఇంకా సమాచారం లేదు.”