Big Stories

KTR Comments: రంజిత్, మహేందర్‌ ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్.. కాళ్లు పట్టుకున్నా పార్టీలో చేర్చుకోం..

 

- Advertisement -
KTR Comments
KTR Comments

KTR Comments: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన గులాబీ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల్లోను గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అగ్ర నేతలు కేసీఆర్‌కు ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కూతురు గద్వాల్ విజయలక్ష్మి, కడియం, ఆయన కూతురు కడియం కావ్య కూడా అతి త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో వీరితో పాటు మరికొంత మంది నేతలు కూడా పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా పార్టీలు మారుతున్న నేతల తీరుపై ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు జరిగిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ తరుణంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మారిన నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

పదవులు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ నే వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. ఈ తరుణంలో ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరు కలిసి కాంగ్రెస్‌ను నాకంటే ఎక్కువగా తిట్టారని అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి, సునీత కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిని చేస్తే సహకరిస్తామని అనుకున్నాం.. కానీ ఓటమికి కారకులయ్యారని మండిపడ్డారు. ఈ మేరకు చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరు ఆస్కార్ నటులు అంటూ విమర్శించారు.

Also Read: పోరాట పంథాలో కథం తొక్కుదాం.. కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. కేటీఆర్ సంచలన ట్వీట్

కవిత అరెస్టు అయిందని తెలిసి ఇద్దరు నవ్వారని అన్నారు. ఇక పార్టీ మారిన వీరిని ప్రజలు ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెబుతారని అన్నారు. ఇక వారు మళ్లీ తిరిగి వచ్చినా పార్టీలోకి తీసుకోబోమని.. కాళ్లు పట్టుకున్నా ఒప్పుకునే పరిస్థితి లేదని అన్నారు. పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు అండగా ఉండకుండా కేకే, కడియం జారుకుంటున్నారని అన్నారు. ఇక కాలమే వారికి సరైన సమాధానం చెబుతుందన్నారు. ఇక రేవంత్ పై కేటీఆర్ ఫర్ అయ్యారు. సిట్టింగ్ సీటే గెలవలేదు కానీ కేసీఆర్ ను తొక్కుతారా అంటూ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అని కాలయాపణ చేయకుండా వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News