Big Stories

Ather Rizta Pre Bookings : ఏథర్ నుంచి ఫ్యామీలీ స్కూటర్.. బుకింగ్స్ స్టార్ట్..!

Ather Rizta
Ather Rizta

Ather Rizta Pre Bookings: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్తకొత్త కంపెనీలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఈవీ మార్కెట్‌లో హోండా, టీవీఎస్, సుజుకీ, హీరో, ఓలా వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు నుంచి ఫ్యామిలీకి సరిపడ రేంజ్, సీటింగ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో లేవు. ఈవీ స్కూటర్లు అన్నీ కూడా ఎక్కువగా ఒకటి లేదా ఇద్దరు ట్రావెల్ చేయడానికి వీలుగా ఉంటాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసేందుకు ఏథర్ సిద్ధమైంది. ఫ్యామిలీకి తగ్గట్టుగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. ఏథర్ రిజ్టాను ఏప్రిల్ 6న మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ప్రీ బుకింగ్ కూడా ప్రారంభించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

- Advertisement -

Also Read : స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు..!

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక ఫ్యామిలీ ప్రయాణించే వీలుగా ఏథర్ రిజ్టా ఈవీ స్కూటర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో అతిపెద్ద స్కూటర్‌గా నిలవనుంది. ఈ స్కూటర్ దక్కించుకోవాలంటే ముందుగానే రూ.999 ఫీజు చెల్లించి బుక్ చేసుకోవాలని పేర్కోంది. ఈ స్కూటర్‌లో భారీ సీటింగ్, బెస్ట్ రేంజ్ కలిగిన బ్యాటరీ ఉంటుందని కంపెనీ ఇది వరకే వెల్లడించింది.

ఏథర్ రిజ్టా.. ఏథర్ 450x కంటే చాలా పెద్ద సీటింగ్‌ను కలిగి ఉంటుంది. స్కూటీ సెగ్మెంట్‌లో ఇది అతిపెద్ద సీటర్ వెహికల్ అని సంస్థ వెల్లడించింది. ఏథర్ 450x.. 22 లీటర్ స్టోరేజ్‌ను కలిగి ఉండే ఇందులో ఆ స్పేస్ ఇంకా పెరగనుంది. అంతేకాకుండా నీటిలోను ఈ స్కూటర్ సమర్థవంతంగా ముందుకు దూసుకెళ్తుంది. కంపెనీ దీనికి సంబంధించిన వీడియోలను ఆఫిషియల్ అకౌంట్‌లో షేర్ చేసింది.

ఆ వీడియో చూసినట్లయితే.. ఏథర్ రిజ్టా ఆప్రాన్-మౌంటెడ్ LED హెడ్‌లైట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన DRLహెడ్‌లైట్‌ను పొందుతుంది. ఇక బ్యాటరీ గురించి చెప్పాలంటే.. 40 అడుగుల ఎత్తు నుంచి బ్యాటరీని కింద పడేసినా కూడా ఆ బ్యాటరీ చెక్కు చెదరకుండా ఉంటుందని సంస్థ తెలిపింది. అలానే ఏథర్ రిజ్టాతో పాటు ఏథర్‌ ఎనర్జీ కొత్త Atherstack 6 OTA అప్‌డేట్‌ను కూడా తీసుకొచ్చింది. అంతేకాకుండా హలో అనే స్మార్ట్ యాక్సెసరీ ఇందులో ఉంది. ఇది స్మార్ట్ హెల్మెట్2గా పనిచేస్తోందని ఏథర్ ఎనర్జీ వెల్లడించింది. దీని ధర రూ.1.30 లక్షలు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News