E-Paper
Advertisement

Khanapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ఖానాపూర్ ఖాన్ ఎవరు?

Khanapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. ఖానాపూర్ ఖాన్ ఎవరు?
Advertisement

Khanapur : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంపై తాజా సర్వే చేసింది. ఈ సెగ్మెంట్ లో 2, 18, 081 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,06, 985 మంది ఉన్నారు. మహిళలు 1, 10, 667 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 ( 01-09-2023)..
బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ జాన్సన్ 38 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మ బొజ్జు పటేల్ బరిలోకి దిగితే 42 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. బీజేపీకి 17 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (03-11-2023)..
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడైయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ రాథోడ్ కు 33 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ 45 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. బీజేపీకి 20 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది.

మారుతున్న లెక్కలు..
రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని అర్థమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్పష్టంగా తేలింది. బీజేపీ కూడా ఓట్ల పెంచుకుందని సర్వేలో వెల్లడైంది.

Advertisement

గత ఎన్నికల చరిత్ర..
2014లో 50 శాతం ఓట్లు, 2018లో 44 శాతం ఓట్లు బీఆర్ఎస్ తెచ్చుకుంది. కాంగ్రెస్ కు 2014 లో కేవలం 19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2018లో 12 శాతం ఓట్లు పెంచుకుంది. ఆ ఎన్నికల్లో 31 శాతం ఓట్లు హస్తం పార్టీకి పడ్డాయి. 2018లో బీజేపీకి 16 శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బలపడుతోందని స్పష్టంగా తేలింది.

ఖానాపూర్ లో కాంగ్రెస్ భారీ తేడాతో గెలిచే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయిందని వెల్లడైంది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×