BigTV English

KTR: వెన్నులో వణుకు.. మలేషియా టూర్ రద్దు.. అసలు కారణాలు ఇవేనా..?

KTR: వెన్నులో వణుకు.. మలేషియా టూర్ రద్దు.. అసలు కారణాలు ఇవేనా..?

చూశారుగా ఇద్దరూ సేమ్ టూ సేమ్ డైలాగులు. ఏమవుతుంది. అయితే గియితే అరెస్టులు అవుతాయి.. అంతే కదా అని సింపుల్ గా కొట్టి పారేస్తున్నారు. ఇద్దరిదీ ఒకటే లైన్. ఇలాగే భారీ డైలాగ్ కొట్టిన కవిత.. ఆల్ రెడీ ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలుకెళ్లి ఆర్నెళ్లకు బెయిల్ పై బయటికొచ్చారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత ఇప్పుడసలు బయటే కనిపించకుండా పోయారు. ఇప్పుడు కేటీఆర్ కూడా రోజూ ఇదే సేమ్ టూ సేమ్ డైలాగ్ కొడుతున్నారు. మీతో ఏమవుతుంది. మహా అయితే రెండు మూడు నెలలు జైలులో పెడుతారు. ఓస్ అంతే కదా.. ఐయామ్ రెడీ అంటున్నారు. యోగా చేసి స్లిమ్, ట్రిమ్ అవుతానంటున్నారు. అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్లింది. ఇక అరెస్ట్ తప్పదని ముందస్తుగానే తనకు తాను మనసులో ఊహించుకుని, ఏవేవో కల్పించుకుని ఇలా మాట్లాడుతున్నారా అన్న టాక్ బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది. లేదంటే కారు ఉక్కపోత ఎక్కువైందా?

మిమ్మల్ని మీరు పోల్చుకోవాల్సిన ఏకైక వ్యక్తి గతంలో మీరే అంటాడు ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్. అవును గతంలో చేసిన పనులకు ఇప్పుడు కేటీఆర్ తనకు తాను అద్దంలో చూసుకోవాల్సింత పనవుతోంది. ఇదంతా ఫార్ములా ఈ రేస్ నిధుల విడుదల గురించి జరుగుతున్న చర్చలో తన పాత్ర గురించి తానే ఇంట్రొడక్షన్ ఇచ్చుకుని కన్ క్లూజన్ చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చాలా విషయాలను చెప్పకనే బయటపెట్టుకున్నారు కేటీఆర్. అప్పుడు నేనే గవర్నమెంట్, సంతకం పెట్టా.. పైసల్ రిలీజ్ చేయించా.


అయితే ఏంటి అని ఎదురుప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో తప్పులు కచ్చితంగా జరిగాయ్ అని ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. ఎందుకంటే ఆఘమేఘాల మీద ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ ను సంప్రదించకుండా, పైగా ఎన్నికల కోడ్ ఉండగా, 55 కోట్ల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించారు. ఇందులో దాచడానికి ఏముందంటున్న కేటీఆర్.. ఇంత అర్జంట్ గా అదీ ఎన్నికల కోడ్ ఉండగా, ఆర్బీఐ, క్యాబినెట్ అనుమతి లేకుండా ఎందుకలా చేశావ్.. ఒక్కడివే మీదికి ఎందుకు తెచ్చుకున్నావ్ అంటే అట్నుంచి సౌండ్ లేదు.

Also Read: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సీటీ నిర్మాణ పనులు ప్రారంభం.. పూర్తి ఏనాటికో తెలుసా!

గత పదేళ్లు షాడో సీఎం అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారాలు నడిపారన్నది వారి ప్రత్యర్థులు చెప్పే మాట. అందుకే చిన్న సీఎం చాలా నిర్ణయాలు సొంతంగా తీసుకున్నారని, అందులో ఫార్ములా ఈ రేస్ ఒకటన్న వాదన వినిపిస్తోంది. మూడోసారి కూడా ఎలాగూ వచ్చేది మనమే అనుకున్నారో ఏమోగానీ.. క్యాబినెట్ అనుమతి లేదు, ఒప్పందాలు లేవు.. సింపుల్ గా నిధులను సింగిల్ సిగ్నేచర్ తో FEOకి ఇచ్చి పడేశారు. కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఆ సొత్తును ఆర్బీఐ అనుమతి లేకుండానే 9 కోట్ల టాక్స్ తో ఎఫ్ఈవో కి చెల్లించడం చట్ట విరుద్దం. ఇవన్నీ జరిగాక హెచ్ఎండీఏ గతేడాది అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకోవడం ఇంకా పెద్ద తప్పు అని ఏసీబీ భావిస్తోంది.

ఎవరో నష్ట పోయారని అందుకు తెలంగాణ సంపదను దోచిపెట్టడం ఏంటని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేసింగ్ ను రద్దు చేస్తే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పరువు పోయిందని, 700 కోట్లు నష్టమన్న వాదనను కేటీఆర్ వినిపించుకొచ్చారు. 2024 ఫిబ్రవరి 10న జరగాల్సిన రేస్ జరగకపోడంతో హెచ్ఎండీఏను సుమారు 200 కోట్ల నష్టాల బారి నుంచి తప్పించింది కాంగ్రెస్ సర్కార్. అయితే HMDA ఇండిపెండెంట్ బోర్డు అని, దాని ఛైర్మన్ సీఎం అని, తాను వైస్ ఛైర్మన్ అని చెబుతూ.. ఎవరి అనుమతీ అక్కర్లేదంటూనే., అరెస్ట్ గురించి కేటీఆర్ ఎందుకంత భయపడుతున్నారన్నదే అసలు పాయింట్. పైగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టినందుకు అరెస్ట్ చేస్తారా అంటూ సెంటిమెంట్ డైలాగులను బయటకు తీస్తున్నారు.

మ్యాటర్ అక్కడితో ఆగలేదు. ప్రెస్ మీట్‌లో తన అరెస్ట్ గురించి తానే ఊహించుకుని మాట్లాడిన కేటీఆర్.. లేటెస్ట్2గా మరో ట్వీట్ చేశారు. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు అంటూనే.. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని, సీఎం బర్త్‌డే సందర్భంగా కావాలంటే కేక్ కట్ చేయించి.. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇచ్చి పంపుతానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇదంతా ఎందుకంటే నవంబర్ 8న కేటీఆర్ మలేషియా వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు, ఏసీబీ దర్యాప్తు వ్యవహారం కీలకంగా మారడంతో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ గా మలేషియా వెళ్తే నెగెటివ్ టాక్ వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారంటున్నారు. అసలే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లి ఇంకా ఇండియా రావట్లేదు. ఇందులో ప్రభాకర్ రావుకు అక్కడే గ్రీన్ కార్డ్ వచ్చినట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. ఇదే లైన్ లో కేటీఆర్ కూడా విదేశాలకు వెళ్లిపోయారన్న టాక్ వస్తే మైనస్ అవుతుందనుకున్నారో ఏమోగానీ.. హైదరాబాద్ లోనే ఉన్నానని ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చుకున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×