CM Chandrababu Meeting: ఏపీలో ఏం జరుగుతోంది? సీఎం చంద్రబాబుతో డీజీపీ, ఇంటెలిజెన్స్ ఛీప్ రాత్రి భేటీ వెనుక ఏం జరిగింది? నిరసనల పేరుతో వైసీపీ అలజడి సృష్టించాలని ప్లాన్ చేసిందా? దళిత మహిళలను రోడ్డెక్కించే ప్లాన్ చేస్తోందా? విదేశాల నుంచి గ్రామ స్థాయి వరకు కాలకేయులు విస్తరించారా? రేపో మాపో కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైపీపీ సోషల్ కాలకేయుల్లో ఒకరైన వర్రా రవీంద్రారెడ్డి శుక్రవారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని లంబాడ తండాలో ఓ పాడుబడిన ఇంటిలో తలదాచుకున్నాడు. ఆ ఇంట్లో నుంచి ఫేస్‌బుక్ ఓపెన్ చేయడంతో వెంటనే అలర్ట్ పోలీసులకు వెళ్లింది. దీంతో అతడ్ని వలపన్ని పట్టుకున్నారు.
పోలీసులు చుట్టుముట్టిన సమయంలో వర్రా, కట్ డ్రాయర్, బనీన్ మీద ఉన్నాడు. పట్టు బడిన వెంటనే అక్కడే విచారణ చేపట్టారు పోలీసులు. విచారణలో కీలక విషయాలు వెల్లడికావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. దీంతో ఏపీ అంతటా పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఒకరు ఇద్దరూ కాదు.. వర్రా లాంటివాళ్లు దాదాపు 500 మంది ఉన్నట్లు తేలింది. వారిపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకోగా, మరికొందర్ని ట్రేస్ చేసే పనిలోపడ్డారు. వారిలో కొందరు మీడియాలో పని చేస్తున్నట్టు సమాచారం. వారి వివరాలు వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.
ALSO READ: సరదాగా పందెం కాశారు.. అన్ని టాబ్లెట్స్ మింగేశారు.. సీన్ కట్ చేస్తే?
సేకరించిన సమాచారంతో శుక్రవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి కీలక సమాచారం వివరించారు.
సోషల్ కాలకేయులను విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారట. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడల నుంచి గ్రామ స్థాయి వరకు సమాచారం వెళ్తుందట. సోషల్ కాలకేయులను అరెస్ట్ చేస్తే.. దళిత మహిళలను రోడ్డెక్కించి నిరసన చేపట్టి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేసినట్టు తేలిందట.
ఇలాంటి వారిని ఉపేక్షించే రాష్ట్రానికి ముప్పు ఉంటుందని ముఖ్యమంత్రి భావించారట. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని, వీలైతే కేంద్రం నుంచి బలగాలు దించాలని ఆలోచన చేస్తోందట కూటమి ప్రభుత్వం.
ఈ విషయం తెలియగానే వైసీపీ కాలకేయులు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. అందులో ఒకరు శ్రీరెడ్డి. శుక్రవారం సాయంత్రం ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఆమె లాంటి వాళ్లు వైసీపీలో చాలామంది ఉన్నారని తెలుస్తోంది. రేపో మాపో వారు కూడా బయటకు రావచ్చని సమాచారం.
మొన్నటికి మొన్న మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్, ఈ విషయం తెలిసి అలర్టయ్యారట. కూటమి ప్రభుత్వంతోపాటు పోలీసులను హెచ్చరించడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినవారు.. రిటైర్మెంట్ అయిన అధికారులను, సప్త సముద్రాల వెనుకున్నా పట్టుకొస్తామని జగన్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మొత్తానికి వైసీపీ బలం, బలహీనత కేవలం సోషల్ మీడియా అని అర్థమైంది. కాలకేయులను పైనుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. వారిని రేపో మాపో అరెస్ట్ చేయడం ఖాయమనే వాదన పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.