Gadwal Municipality: బ్యూరో స్వేచ్ఛ: జిల్లాలో ప్రచార హోరు వేడెక్కుతోంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడం బీఫాంల గోల కూడా కొలిక్కి రావడంతో టికెట్లు వచ్చిన అభ్యర్థులు కదన రంగంలోకి దిగారు. జిల్లాలోని అలంపూర్ వడ్డేపల్లి ఐజ మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలో రెబల్స్ ప్రభావం పెద్దగా లేదు కానీ గద్వాలలో మాత్రం వింత పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 37 స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి అటు సరిత వర్గం ఇటు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వర్గీయులు అన్ని స్థానాలకు నామినేషన్ వేశారు అయితే వీరిలో ఎమ్మెల్యే వర్గానికి 36 మందికి బీఫాంలు దక్కాయి. సరిత వర్గంలోని ఏడు మందికి బీఫాంలో లభించాయని ప్రచారం జరిగిన కేవలం 30 వ వార్డుకు చెందిన ఒకరికి మాత్రమే బీఫామ్ దక్కింది. దీంతో వారు రెబెల్సుగా బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార బాధ్యతలను చేపట్టి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వెంట నడిచిన వారు ప్రస్తుతం కూడా ఆయనతోనే ఉన్నారు. తాజాగా 20 మంది కాంగ్రెస్ నుంచి టికెట్లు కూడా పాత కాపులే పోటీ చేస్తున్న కేవలం పార్టీ గుర్తులు మాత్రం మారాయి.
ఎమ్మెల్యే వర్గీయులకు అత్యధికంగా టికెట్లు రావడం సరిత వర్గీయులు ఒక్కరు మాత్రమే టికెట్ పొందడం మిగతావారు కాంగ్రెస్ రెబెల్సుగా ఉండడంతో పోటీ తీవ్రం కానుంది. మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ బీఫాంల గొడవతో రెబల్ అభ్యర్థులు కూడా ప్రచారం తీవ్రం చేస్తున్నడంతో ఏ పార్టీ గెలుస్తుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. బిఆర్ఎస్ , బిజెపి కి సైతం పట్టణంలో పట్టు ఉండడంతో హంగు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ నడుస్తోంది. గతంలో బిఆర్ఎస్ నుంచి గెలిచిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నడంతో ఆ పార్టీ కాస్త ఢీలా పడినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఎమ్మెల్యే మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సాధించడం గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండడంతో మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తోడవడంతో అభివృద్ధి చెందే అవకాశం ఉండడంతో ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
Also Read: Bolt Robot: మనుషుల కంటే వేగంగా పరుగులు తీసే రోబో.. ఒక్క సెకనులో 10 మీటర్ల స్పీడ్
జిల్లాలో ఐజ, వడ్డేపల్లి ,అలంపూర్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకపోగా గద్వాల అతిపెద్ద మున్సిపాలిటీ కాగా ఇక్కడ 37 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. ఇతర పార్టీలలో రెబల్స్ బెడద లేకపోగా ఒక్క కాంగ్రెస్ లోనే రెబల్స్ ఆ పార్టీ అభ్యర్థులకు టిక్కెట్లు రాకపోవడంతో బరిలో ఉండి దీటుగా ప్రచార నిర్వహిస్తూ ఆ పార్టీ అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి తన మద్దతు అని సరిత స్పష్టం చేస్తున్నారు. వారి గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ఆమె చరిష్మాతో విజయం సాధిస్తామని అభ్యర్థులు విశ్వాసంతో ఉన్నారు
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నడం గతంలో బిఆర్ఎస్ లో ఉన్నవారికి ప్రస్తుతం కాంగ్రెస్ తరపున టికెట్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో ఓటర్లు ఎవరు వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సరిత వర్గం తామే అసలైన కాంగ్రెస్ వాదులమని తమను గెలిపించి పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నిక సమరం రసవత్తరంగా మారింది.
జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ అన్ని దారులు వెతుకుతోంది. ఉచిత కరెంటు, మహాలక్ష్మి, వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ గెలిపించాలని కోరుతున్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. బిజెపి కేంద్ర పథకాలను ప్రజలకు తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని వారు ప్రజలకు సూచిస్తున్నారు.
Also Read: Highway Robbery: హైవేపై భారీ దోపిడి.. రన్నింగ్ ట్రక్ నుంచి.. ఫ్లిప్‌కార్ట్ ఫోన్లు దోచేశారు!