BigTV English

Registration Charges Hike: తెలంగాణ సర్కార్ తీవ్ర కసరత్తు.. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

Registration Charges Hike: తెలంగాణ సర్కార్ తీవ్ర కసరత్తు.. ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

Registration Charges Hike in Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది.


దశలవారీగా పరిశీలన
రాష్ట్రంలో భూముల మార్కెట్ వాస్తవ ధర, ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉంది. ఈ మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించనుంది. ఈ మేరకు ఈనెల 18న అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల సమావేశం కానున్నారు. దశలవారీగా పరిశీలన చేసి జులై 1వరకు కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫైనల్ చేయనున్నారు. అలాగే 23న మార్కెట్ విలువ సవరణ, 29న కమిటీ ఆమోదం, జులై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తీసుకొని పరిష్కరించనున్నారు. అనంతరం తుది మార్కెట్ విలువలన ఖరారు చేయనున్నారు.

Also Read: కేసీఆర్ సార్.. మర్చిపోయారా? ఇప్పుడు మీరు సీఎం కాదు


తీవ్ర కసరత్తు..
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ముందుగా గుర్తిస్తారు. ఇందులో వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్‌లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. పురపాలక సంఘాలు, కార్పోరేషన్లలో స్థానిక ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారిక సూచనలు తీసుకొని బహిరంగ మార్కెట్ ధరలపై అధికారులు అంచనాకు రానున్నారు. కమర్షియల్ ఏరియాలు, మెయిన్ రోడ్లు వంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ విలువను నిర్ణయించనున్నారు.

Tags

Related News

Weather News: మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ రెండ్రోజులు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జిల్లాలివే

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్‌ బంద్

Telangana: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..? అసలు నిజం ఇదే..

Telangana Railway Projects: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy: మేడారం పర్యటనకు.. సీఎం రేవంత్‌ రెడ్డి

Telangana Govt: తెలంగాణలో కొత్త పద్దతి.. నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం, అదెలా ?

Heavy Rains: బీ అలర్ట్..! మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Yedupayala Temple: 27 రోజుల త‌ర్వాత‌ తెరుచుకున్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Big Stories

×