BigTV English

Bandi Sanjay: బండి సంజయ్‌కి రిమాండ్.. 14 రోజుల జైల్.. నెక్ట్స్ బెయిలా? కస్టడీయా?

Bandi Sanjay: బండి సంజయ్‌కి రిమాండ్.. 14 రోజుల జైల్.. నెక్ట్స్ బెయిలా? కస్టడీయా?
bandi sanjay remand

Bandi Sanjay: బండి సంజయ్‌కి రిమాండ్ విధించింది కోర్టు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఆయనకు 14 రోజుల రిమాండ్ పడింది. బండి సంజయ్‌ను ఖమ్మం జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 19 వరకు జైల్లోనే ఉండనున్నారు సంజయ్. సంజయ్‌కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరగా.. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి బండి సంజయ్‌కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.


న్యాయమూర్తి రిమాండ్ విధించగానే.. సంజయ్ తరఫఉ లాయర్లు వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బెయిల్‌పై కౌంటర్ వేస్తామని పీపీ చెప్పడంతో.. విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు, బండి సంజయ్ అరెస్టుపై గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు బీజేపీ లీగల్ సెల్ రెడీ అవుతోంది. ఇక, బండి సంజయ్‌ కస్టడీ పిటిషన్‌కు పోలీసులు సిద్ధమవుతున్నారు.

న్యాయమూర్తి ముందు ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా జరిగాయి. అసలు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానమే సరిగా లేదంటూ వాదించారు. నిబంధనల ప్రకారమే అరెస్ట్ చేశామని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.


అంతకుముందు, పోలీసుల దురుసు ప్రవర్తనతో తనకు తగిలిన గాయాలను షర్ట్ విప్పి న్యాయవాదులకు చూపించారు బండి సంజయ్. రాత్రి నుంచి పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్ చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు తెలిపారు.

టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు హాజరుపర్చారు. బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో బండి సంజయ్‌‌ను వెనుక గేటు నుంచి లోపలికి తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరస్పర వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షించారు.

పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌పై బలమైన కేసులో పెట్టారు పోలీసులు. కమలాపూర్ పోలీసులు ఆయనపై ఐపీసీలోని 420, ఐటీ యాక్టులోని 66-డీ, తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ ప్రివెన్షన్ చట్టంలోని సెక్షన్ 4(ఏ), 6 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. ఇక్కడితో సరిపెట్టలేదు పోలీసులు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 154, 157 ప్రకారం కూడా కేసు ఫైల్ చేశారు. ఇక కోర్టులో హాజరుపరిచే ముందు రిమాండ్ రిపోర్టులో సెక్షన్ 120ని కూడా జత చేశారు. పేపర్ లీక్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏకంగా ఏ1 నిందితుడిగా చేర్చారు పోలీసులు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×