BigTV English

Revanth Reddy on KCR KTR : మీది ప్రజా పక్షమా?.. ప్రధాని-అదాని పక్షమా?.. కేసీఆర్ కు రేవంత్ సూటి ప్రశ్న..

Revanth Reddy on KCR KTR : మీది ప్రజా పక్షమా?.. ప్రధాని-అదాని పక్షమా?.. కేసీఆర్ కు రేవంత్ సూటి ప్రశ్న..

Revanth Reddy on KCR KTR : ప్రధాని – అదానీ ఒక్కటై ప్రపంచ దేశాల ముందు భారత పరువు తీస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలకే లంచం ఇవ్వాలని చూసి దొరికిపోయిన అదానీపై కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదన్న సీఎం.. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్, అతని కుటుంబ సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే అదానీ వ్యవహారంలో వారు ఎవరి వైపో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీపై అనేక విమర్శలు చేశారు.


భారత ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ అల్లర్లు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రం వైఖరికి నిరసనగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన నిరసనల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా.. మిగతా మంత్రివర్గ సహచరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అదానీ అవినీతి వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ విధానమేంటని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి.. మీరు ప్రజల వైపా, అదానీ-ప్రధాని వైపా అని ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం అదానీ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేస్తోందని.. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం ఎలా ధర్నా చేస్తారని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని.. మరి వాళ్లెందుకు ఎందుకు ధర్నా చేయడం లేదు అన్నారు. దేశానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, ఇక్కడి ప్రజలు నష్టపోతున్నప్పుడు వారికి అండగా ఉండేందుకు సీఎం నిరసన తెలపడంలో తప్పులేదన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ప్రధాని మోదీని, అదానిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

బీఆర్ఎస్ నేతలు అదానీతో చికటి ఒప్పందం చేసుకున్నరాని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..  ప్రధాని మోదీకి కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారన్నారు. ఒకవేళ అదానీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారనే భయంతో బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని అన్నారు. కేటీఆర్ నిత్యం దిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల దగ్గర కేసుల నుంచి తప్పించాలని అభ్యర్థిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి.. దిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేసిన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి లొంగిపోయారని అన్నారు.

Also Read : రేవంత్ రెడ్డిపై ట్రోలింగ్స్.. బన్నీ ఆర్మీపై కేసులు

కేసీఆర్ కుటుంబం ఆదానీ-ప్రధాని వైపా, ప్రజల వైపా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే.. అసెంబ్లీలో అదానిపై జేపీసీ విచారణ జరగాలనే తీర్మానం పెడతామని.. దానికి మద్ధతు ప్రకటించాలని డిమాండ్ చేసారు. సభలో ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్రానికి పంపుదామని.. మీరూ మద్ధతు ఇవ్వడి అని అడిగారు. మోదీ-కేసీఆర్‌ వేర్వేరు కాదు.. ఇద్దరూ నాణేనికి బొమ్మాబొరుసు వంటి వారన్నారు. అవినీతి కేసుల్లో అదానీకి ప్రధాని అండగా నిలబడినా.. ప్రజాకోర్టులో అదానీని శిక్షించే వరకు పోరాడుతామని నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×