Rashmika Mandanna : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది. ఆ సినిమాతో రష్మిక వెనక్కి చూసుకోలేని రికార్డు ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. దాంతో అక్కడ పలు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక తెలుగులో రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. ఆ మూవీ మొదటిరోజు నుంచి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకోవడం మాత్రమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. వారంలోపే వెయ్యి కోట్లు వసూల్ చేసి టాలీవుడ్ హిస్టరీని క్రియేట్ చేసుకుంది. అలాగే రెండు వారాలకు 1600 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లు తెలుస్తుంది. ఈ మూవీ సక్సెస్ టాక్ ను అందుకున్న నేపథ్యంలో రష్మిక పలు ఛానెల్స్ ఇంటర్వ్యూ లు ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకున్న వింత వ్యాధిని బయటపెట్టింది.. అది విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
రష్మిక మందన్నకు వింత ఫోబియా..
పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఇటీవల రష్మిక మందన్న ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో భాగంగా తన సినిమాల గురించి అందరికి చెప్పింది. వరుస సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని చెప్పి ఫ్యాన్స్ ను దిల్ ఖుషి చేసింది. అంతలోనే మరో షాక్ ఇచ్చింది. ఆమెకు వింత ఫోభియా ఉందని చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన భయాలు ఉంటాయి. కొందరికి నీళ్లు అంటే భయం, మరి కొందరికి ఎత్తయినా ప్రదేశాలు.. లేదా జంతువులు అంటే భయం ఉంటుంది. అలాగే నాకు ఒక ఫోబియా ఉందని వెల్లడించింది.. నాకు అలాంటి భయమే ఉందని తన సీక్రెట్ ను రివీల్ చేసింది. రష్మిక అంతలా భయపడే అంశం ఏదో కాదట. తనని ఎవరైనా ఎత్తుకుంటే ఆమెకి ఎంతో భయమేస్తుందట. ఈ నేపథ్యంలోనే పుష్ప 2లో పీలింగ్స్ సాంగ్ చేసేటపుడు చాలా భయపడినట్టుగా ఆమె చెప్పింది. ఆ సాంగ్ లో చాలా మూమెంట్స్ లో అల్లు అర్జున్ నడుము వరకు ఎత్తుకొని ఇంకో మూమెంట్ అయితే ఏకంగా తన భుజాలపైకి ఎక్కి మాస్ స్టెప్పులు చేస్తుంది. తనకి ఇలాంటివే భయం అని చెప్పుకొచ్చింది.. ఇది విన్న ఆమె ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.. ఇదేం వింత జబ్బు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక చివరగా తెలుగులో కుబేర, హిందీలో సికందర్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో పుష్ప 2కి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 3 కూడా ఉందని ఆమె చెప్పుకొచ్చింది.. ఇందులో ఎలా కనిపిస్తుందో చూడాలి..
పుష్ప 2 కలెక్షన్స్ చూస్తే..
13 రోజుల్లో పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1409 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత వేగంగా రూ. 1400 కోట్ల మార్క్‌ను అందుకున్న సినిమాగా నిలిచింది. గతంలో వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి ఎపిక్ వండర్ బాహుబలి 2కి ఈ ఫీట్ సాధించడానికి 16 రోజులు పట్టగా.. పుష్ప 2 కేవలం 11 రోజుల్లోనే ఈ మార్క్ చేరుకుంది.. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే మాత్రం అతి త్వరలోనే 2000 కోట్లు రాబట్టి తెలుగు మూవీ చరిత్రను తిరగ రాయడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.