E-Paper
Advertisement

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ!

తెలంగాణ యువతకు ఆర్మీ అవకాశాలు.. సదరన్ కమాండ్ అధికారులతో సీఎం రేవంత్ కీలక భేటీ!
Advertisement

Army Recruitment: భారత సాయుధ దళాల్లో తెలంగాణ యువత ప్రాతినిధ్యం పెరిగేలా, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లలో వారికి పూర్తి మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD) లో ఉన్న ‘బోధి పెవిలియన్’ వేదికగా భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తో సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు TASA సబ్‌ ఏరియా జీఓసీ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రాల్లో ఉచిత శిక్షణా కేంద్రాలు

Advertisement

ఆర్మీ నియామకాల్లో మన స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. ఆర్మీకి ఆసక్తి ఉన్న యువకుల కోసం రాష్ట్రంలోని ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ముందస్తు శిక్షణా కార్యక్రమాలు (Pre-recruitment Training) నిర్వహించాలని సీఎం కోరారు. దీనికి లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు ముందు తెలంగాణలోని జిల్లాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

విపత్తుల వేళ తక్షణ సహాయం

Advertisement

దేశంలో క్లిష్ట పరిస్థితులు, విపత్తులు ఎదురైనప్పుడు సైన్యం అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనడం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. దీనిపై స్పందించిన సైనిక అధికారులు, తెలంగాణలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే స్థానిక ఆర్మీ బృందాలు తక్షణమే రంగంలోకి దిగేలా ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

Also Read: జనసేనలోకి రాజాసింగ్..? అసలు ప్లాన్ ఇదేనా?

మూసీ పునరుజ్జీవనానికి సైన్యం ప్రశంసలు

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంతో పాటు, దానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ ను లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అభినందించారు. చారిత్రక హైదరాబాద్ నగర పరిరక్షణకు మూసీ ప్రక్షాళన ఎంతో కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.

Tags

Related News

ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 40 మంది, ఖమ్మం జిల్లాలో ఘటన

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

Big Stories

Advertisement
×