E-Paper
Advertisement

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!
Advertisement

Munugode: స్వేచ్చ బ్యూరో: నియోజకవర్గంలో ప్రతి పల్లె అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధికి చిరునామగా మార్చాలని లేని పక్షలో మరో ప్రాంతానికి వెళ్లి పోవాలాని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పంచాయతీ సెక్రటరీలకు స్పష్టం చేశారు. బాధ్యత తీసుకుని పనిచేయలేని వారు ఇక్కడ కొనసాగాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

అధికారులతో సమీక్ష..

సోమవారం నల్గొండ జిల్లా మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 28 గ్రామాల పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో శానీటేషన్, తాగునీరు, వీధిదీపాలు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై సెక్రటరీల పనితీరును సమీక్షించారు. ఇబ్బందులు ఉంటే చెప్పండి పరిష్కరిస్తామని చెప్పారు. సెక్రటరీల పనితీరును ఇకపై నిరంతరం పర్యవేక్షిస్తామని, ప్రతి నెలా పనితీరు నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తామన్నారు.

వేసవికి ముందే అలర్ట్..

Advertisement

ఎల్‌నినో పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ముందుచూపుతో కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామాల వారీగా నీటి వనరులు, సరఫరా వ్యవస్థ, అవసరమైన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మల్టీపర్పస్‌ వర్కర్లకు భరోసా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also read: భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Tags

Related News

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Big Stories

Advertisement
×