E-Paper
Advertisement

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?
Advertisement

HYDRAA: స్వేచ్చ బ్యూరో: నగ‌ర శివార్ల‌లో ముందుగా వెలిసిన కాల‌నీల‌కు ర‌క్ష‌ణ కోసం నిర్మించుకున్న ప్ర‌హ‌రీలు ఇప్పుడు ప‌క్క‌న కొత్త‌గా వ‌చ్చిన కాల‌నీల‌కు, నివాస ప్రాంతాల‌కు దారి లేకుండా చేస్తున్నాయ‌ని సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ప‌లువురు ఫిర్యాదు చేశారు. అడ్డంగా గోడలు కట్టి, లే ఔట్ లో దారి కోసం కేటాయించిన దారులను కూడా మూసివేస్తున్నట్లు వాపోయారు. గ‌తంలో చుట్టుప‌క్క‌ల కాల‌నీలు, నివాస ప్రాంతాలు లేన‌ప్పుడు ప్ర‌హ‌రీ ఉన్నా అభ్యంత‌రాలు ఉండేవి కాద‌ని, ఇప్పుడు త‌మ‌కు దారి ఇవ్వ‌క పోతే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు.

హ‌య‌త్‌న‌గ‌ర్..

దారులు మూయ‌కూడ‌ద‌ని స్పష్టమైన నిబంధనలున్నా, ప్ర‌హ‌రీల‌ను తొల‌గించ‌డానికి అక్క‌డి నివాసితులు ఇష్ట‌ప‌డ‌డంలేద‌ని, ఇప్పుడ‌వి ఇబ్బందిగా ప‌రిణ‌మిస్తున్నాయ‌ని చుట్టుప‌క్క‌ల ఉన్న కాల‌నీ వాసులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం కుంట్లూరు విలేజ్‌లోని ప్ర‌జ‌య్ గుల్‌మొహ‌ర్ కాల‌నీ వారు ప్ర‌హ‌రీలు తొల‌గించ‌క‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న త‌మ ప్లాట్ల‌కు వెళ్ల‌లేక‌పోతున్నామ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లంలో 85.20 ఎక‌రాల‌లో 596 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో 11 ఎక‌రాల మేర ఉన్న లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కులు క‌బ్జా చేసి, త‌మ‌కు దారి లేకుండా చేస్తున్నార‌ని తెల్లాపూర్ జి బ్లాక్ ప్లాట్ ఓన‌ర్ల సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసి, త‌మ‌కు దారి చూపించాల‌ని కోరారు.

Advertisement

Also read: గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

మొత్తం 42 ఫిర్యాదులు..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం శ్రీ‌రాంన‌గ‌ర్ కాల‌నీలో విల్లాలు నిర్మించిన వారు త‌మ ప్లాట్‌కు దారి లేకుండా ర‌హ‌దారిని క‌బ్జా చేసేశార‌ని అక్క‌డి స్థానికుడు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ లోని ఏజీఎస్ లే ఔట్‌లోకి కెమిక‌ల్ వాట‌ర్ వ‌స్తుంధని, సాఫీగా ప్రవహించే నాలాలో ఆటంకాలు సృష్టించ‌డంతో త‌మ ప‌రిస‌రాల‌ను పారిశ్రామిక వ్య‌ర్థ జ‌లాలు ముంచెత్తుతున్నాయ‌ని హైడ్రా ప్ర‌జావాణిలో వాపోయారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 42 ఫిర్యాదులందినట్లు, వీటిని హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌కుమార్ ప‌రిశీలించి, ప‌రిష్కారం కోసం సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

Advertisement

Also read: ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

Tags

Related News

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Big Stories

Advertisement
×