E-Paper
Advertisement

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!
Advertisement

Rajiv Yuva Vikasam: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని బీసీ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉన్నతి కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కొరకు స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని అధికారులను సూచించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఎంజేపీ (మహాత్మా జ్యోతిబా పూలే) గురుకులాల్లో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలోనే క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

నిధులు విడుదల..

గురుకుల విద్యాలయాలకు స్వంత భవనాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేయగా, ఆ అంశాన్ని పరిశీలిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతల (ఇన్‌స్టాల్‌మెంట్స్) రూపంలో 180 మంది విద్యార్థులకు రూ.18 కోట్ల 40 లక్షల నిధులను విడుదల చేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

మరో 10 వేల మందికి..

Advertisement

సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ నిధులను నేరుగా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Also read: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ అధికారి!

స్కూళ్ల నిర్మాణాలను పరుగులు..

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ లో సోమవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల భవన నిర్మాణ పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఈ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు శ్రమించి పనుల్లో పురోగతి చూపాలన్నారు.

అత్యుత్తమ విద్యాబోధన..

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను, సకల సౌకర్యాలను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి మైనారిటీ వర్గాల పిల్లలందరినీ ఒకే చోట చేర్చి సమీకృత పద్ధతిలో అత్యుత్తమ విద్యాబోధన అందించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక సమానత్వం పెంపొందుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

Also read: భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

Tags

Related News

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×