boAt Bassheads 900: ఈరోజుల్లో మంచి ఆడియో క్వాలిటీ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన సౌండ్ అందించే గ్యాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వైర్‌లెస్ టెక్నాలజీ ఎంత వచ్చినా, వైర్‌డెడ్ హెడ్‌ఫోన్స్ ఇచ్చే లాగ్-ఫ్రీ మ్యూజిక్ ఫీల్ వేరుగా ఉంటుంది. ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘బోట్’ (boAt) నుంచి వచ్చిన ‘బాస్‌హెడ్స్ 900’కార్బన్ బ్లాక్ వైర్‌డెడ్ ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ మ్యూజిక్ లవర్స్ మనసు దోచుకుంటున్నాయి. కేవలం రూ. 899 ధరకే లభిస్తున్న ఈ హెడ్‌ఫోన్ పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
మార్కెట్లో ఎన్నో రకాల హెడ్‌ఫోన్స్ లభిస్తున్నప్పటికీ.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫర్మామెన్స్ అందించడంలో బోట్ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ‘బోట్ బాస్‌హెడ్స్ 900’ మోడల్ చాలా కాలంగా కస్టమర్ల ఫేవరెట్ గ్యాడ్జెట్‌గా నిలుస్తోంది. కార్బన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించే ఈ హెడ్‌ఫోన్, చూడటానికే కాకుండా ఫర్మామెన్స్ లో కూడా అద్భుతంగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇచ్చే ఆడియో డివైజ్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఈ హెడ్‌ఫోన్ బెస్ట్ హైలైట్ దీనిలో ఉండే 40 మిమీ నియోడైమియం డ్రైవర్లు. ఇవి పాటల్లోని ప్రతీ బీట్‌ను, లయను చాలా స్పష్టంగా వినిపిస్తాయి. బోట్ ప్రత్యేకమైన ‘సూపర్ ఎక్స్‌ట్రా బాస్’టెక్నాలజీ కారణంగా మ్యూజిక్ వింటున్నప్పుడు థియేటర్ లాంటి ఫీల్ కలుగుతుంది. రాక్ మ్యూజిక్, డీప్ బాస్ సాంగ్స్ ఇష్టపడే.. వారికి ఈ హెడ్‌ఫోన్ ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఎలాంటి డిస్టార్షన్ లేకుండా క్లియర్ సౌండ్ పొందవచ్చు.
కేవలం పాటలు వినడానికే కాకుండా.. ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇందులో ఇన్-లైన్ మైక్రోఫోన్ సపోర్ట్ ఉంది. మైక్‌లో బిల్ట్-ఇన్ నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీ ఉండటం వల్ల బయటి శబ్దాలు ఎక్కువగా వినిపించకుండా అవతలి వారికి మన గొంతు స్పష్టంగా చేరుతుంది. అలాగే వైర్‌పై ఉండే చిన్న రిమోట్ కంట్రోల్ ద్వారా వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, కాల్స్ మాట్లాడటం లేదా మ్యూజిక్ ప్లే/పాజ్ చేయడం వంటి పనులను చాలా ఈజీగా చేయవచ్చు.
ఈ హెడ్‌ఫోన్ బరువు చాలా తక్కువగా (సుమారు 150 గ్రాముల కంటే తక్కువ) ఉంటుంది. దీని వల్ల గంటల తరబడి చెవులకు పెట్టుకుని ఉన్నా ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం కలగదు. ఇయర్‌కప్స్ చాలా మృదువుగా ఉండి చెవులకు సౌకర్యంగా ఫిట్ అవుతాయి. అంతేకాకుండా.. ఇది ఫోల్డబుల్ డిజైన్‌ను కలిగి ఉండటం వల్ల ఈజీగా మడతపెట్టి బ్యాగ్‌లో సర్దుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు దీన్ని వెంట తీసుకెళ్లడం చాలా ఈజీ.. అంతే కాకుండా ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉండే గుణం కలిగి ఉంటుంది.
Also Read: తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి
మార్కెట్లో ఈ హెడ్‌ఫోన్ అసలు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రత్యేక ఆఫర్ల ద్వారా ప్రస్తుతం కేవలం రూ. 899 ధరకే కస్టమర్లకు లభిస్తోంది.
తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం సౌండ్, మంచి బేస్, మైక్ ఆప్షన్.. ఎక్కువ కాలం పాడవకుండా ఉండే.. హెడ్‌ఫోన్ కావాలంటే ‘బోట్ బాస్‌హెడ్స్ 900’ కార్బన్ బ్లాక్ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 899 ధరలో లభించే ఈ బెస్ట్ వైర్‌డెడ్ హెడ్‌ఫోన్‌తో మీ మ్యూజిక్ జర్నీని మరింత ఆనందంగా మార్చుకోండి.