E-Paper
Advertisement

జనసేనలోకి రాజాసింగ్..? అసలు ప్లాన్ ఇదేనా?

జనసేనలోకి రాజాసింగ్..? అసలు ప్లాన్ ఇదేనా?
Advertisement

Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. మీడియా మైక్‌ ముందుకొచ్చినా.. సెల్ఫీ వీడియోలో మాట్లాడినా.. పొలిటికల్ హీట్ పెరగడం గ్యారెంటీ. అయితే ఈసారి ఆయన టార్గెట్ పూర్తిగా మారింది. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయంలోకి జనసేన అంశాన్ని స్క్రీన్‌పైకి తెచ్చారు. తెలంగాణలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసే సత్తా పవన్ కల్యాణ్‌కు ఉందంటూ ఆకాశానికి ఎత్తేశారు.

రాజాసింగ్ మాటల వెనుక అసలు లెక్కేంటి..?

Advertisement

యువతలో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌తో జనసేన బలమైన శక్తిగా మారుతుందన్నది రాజాసింగ్ లెక్క. కానీ.. ఈ మాటల వెనుక అసలు లెక్కేంటి? జనసేనపై అభిమానమా? లేక బీజేపీపై అసంతృప్తితో కొత్త రాజకీయ దారిని వెతుక్కుంటున్నారా?రాజాసింగ్ వ్యాఖ్యలు కేవలం పవన్ కల్యాణ్‌పై ఉన్న ప్రేమాభిమానాలతో చేసినవి కావు.. దీని వెనుక తీవ్రమైన ఆక్రోశం, పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఏమీ లేదని ఇప్పుడే చెప్పలేం.

పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు..

Advertisement

పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు.. తెలంగాణలో జనసేన విస్తరణకు సూచనలు..బీజేపీ నాయకత్వంపై విమర్శలు.. ఈ మూడు అంశాలను కలిపి చూస్తే.. జనసేనలో చేరేందుకు ఇచ్చిన సంకేతమా? లేక బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజాసింగ్‌ ఆడుతున్న పొలిటికల్ గేమా? సమాధానం భవిష్యత్తే చెప్పాలి. కానీ.. రాజాసింగ్‌ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మాత్రం జనసేన ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. మరి రాజాసింగ్ విసిరిన ఈ పొలిటికల్ బాంబ్ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×