E-Paper
Advertisement

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!
Advertisement

Gadwal Municipality: స్వేచ్ఛ బ్యూరో: మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఒక్కరు మున్సిపాలిటీకి చెందిన షాపుల అద్దె సొమ్ము వసూళ్లు చేసి అందులో నుండి రూ.11 లక్షల పై చిలుకు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జానకీరాం సాగర్‌ గతంలో వెల్లడించారు.కాగా, దుర్వినియోగమైనట్లు గుర్తించిన రూ.11 లక్షలకు పైగా సొమ్మును సోమవారం మున్సిపల్‌ క్యాషియర్‌ విభాగంలో జమ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని కమిషనర్‌ తెలిపారు.

వసూళ్ల బాధ్యత..

అనంతరం ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా మున్సిపాలిటీ అధికారిక ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన అద్దె వసూళ్లలో సంబంధిత మొత్తం తిరిగి ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు. అయితే, సొమ్ము జమ చేసినంత మాత్రాన వ్యవహారం ముగిసినట్లు కాదని, అద్దె వసూళ్లలో జరిగిన మొత్తం లావాదేవీలు, వసూలైన నగదు వినియోగం, జమలో జరిగిన జాప్యానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని కమిషనర్‌ స్పష్టం చేశారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి అద్దె సొమ్ము వసూళ్ల బాధ్యత అప్పగించిన విధానం, సంబంధిత పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించిన అధికారులు, సిబ్బంది పాత్రపైనా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Also Read: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి రెవెన్యూ అధికారి!

నిబంధనల ప్రకారం

విచారణలో సొమ్ము దుర్వినియోగానికి సంబంధించి ఎవరి బాధ్యత ఎంత మేరకు ఉందనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ జానకీరాం సాగర్‌ తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయ వనరుల విషయంలో ఇకపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.

అధికారుల ప్రమేయం వల్లే సర్దుబాటు!

Advertisement

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో మున్సిపాలిటీ ఆర్ ఐ, ఆర్ ఓ ప్రమేయం ఉండడం, అదే వసూళ్ల రసీదులో వారి హోదాలు ఉండడంతో 11.80 లక్షల నగదును మున్సిపాలిటీ బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సర్దుబాటు చేశారని విమర్శలు వస్తున్నాయి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి అద్దె వసూలు బాధ్యతలను అప్పజెప్పడంపై ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఈ క్రమంలో మునిసిపల్ సిబ్బంది దిద్దుబాటు చర్యలను చేపడుతున్నారు. మున్సిపాలిటీలో వార్డులకు అధికారులను నియమించినప్పటికీ ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పజెప్పడంపై పాలన వ్యవహారాలలో అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది.

Also read: ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

Tags

Related News

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

భార్య పేరుతో భర్త పెత్తనం.. నిజామాబాద్ జిల్లాలో అధికార దుర్వినియోగం!

ఏబీవీపీ నాయకుడి నుంచి సీఎంగా.. తన పొలిటికల్ జర్నీని చెప్పిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×