EPAPER

Revanth Reddy : మిస్టర్ పర్ ఫెక్ట్ రేవంత్ రెడ్డి.. మునుగోడులో క్లీన్ పాలిటిక్స్..

Revanth Reddy : మిస్టర్ పర్ ఫెక్ట్ రేవంత్ రెడ్డి.. మునుగోడులో క్లీన్ పాలిటిక్స్..

Revanth Reddy : ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. మునుగోడులో రచ్చ రచ్చ నడుస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల మంట రగులుతోంది. పార్టీ ఫిరాయింపులతో పోటాపోటీ పాలిటిక్స్ చేస్తున్నారు. వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మందు, విందులతో ప్రలోభాలు. ఓటుకు 10వేల వరకూ ఇస్తున్నారనే ప్రచారం. ఇదేమి రాజకీయం అంటూ అంతా చీదరించుకునే పరిస్థితి. మునుగోడులో ఇంతటి హోరాహోరీ రాజకీయం నడుస్తున్నా.. నేనొక్కడినే అంటూ రేవంత్ రెడ్డి ఒక్కరే మిస్టర్ క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.


ఓవైపు బీజేపీ, టీఆర్ఎస్ లు లొల్లిలొల్లి చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా, సింపుల్ గా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించే బాధ్యతలు తనపైనే వేసుకున్నారు. సీనియర్లు సహకరించపోయినా.. వెంకట్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నా.. డోంట్ కేర్ అంటున్నారు. సంప్రదాయ ప్రచారశైలినే నమ్ముకున్నారు. ప్రజల్లో ఉంటున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని, ప్రత్యర్థి పార్టీలను విమర్శిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీని మోసం చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ తోనే మంచి భవిష్యత్తు ఉంటుందని వివరిస్తున్నారు. అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు.

కాంగ్రెస్ తరఫున ఎలాంటి అప్రజాస్వామిక చర్యలు లేవు. నేతలను ప్రలోభపెట్టడాలు కానరావు. మద్యం పోయడం, డబ్బులు పంచడం, పార్టీ ఫిరాయింపులు, దూషణలు, దౌర్జన్యాలు లాంటివి లేనే లేవు. పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ శ్రేణులు అడ్డుకుని రెచ్చగొట్టినా.. గాంధీ మార్గంలో ధర్నాలతోనే నిదర్శన ప్రదర్శన చేశారు కానీ ఎలాంటి దాడులకు తెగబడలేదు. కాంగ్రెస్ శ్రేణులు చాలా ఓపికగా, హుందాగా ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు.


పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక కత్తి మీద సాము లాంటిది. బై ఎలక్షన్ సమయంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగుపెట్టడంతో.. ఆయనకు డబుల్ టాస్క్ మొదలైంది. ఇటు మునుగోడును చూసుకోవాలి.. అటు జోడో యాత్రను సక్సెస్ చేయాలి. అందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు రేవంత్. ఉదయం మునుగోడులో ఉంటే.. సాయంత్రానికి పాదయాత్రలో రాహుల్ పక్కన ప్రత్యక్షమవుతున్నారు. కార్నర్ మీటింగ్స్ లో తోడుంటున్నారు. ఓరోజు రాహుల్ వెంట పరుగులు.. ఇంకోరోజు మునుగోడులో ప్రచార ర్యాలీలు. ఎందెందు చూసినా.. రేవంతే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ లో సర్వం తానై వ్యవహరిస్తున్నారు. అందుకే, తమ నాయకుడు మిస్టర్ పర్ ఫెక్ట్ అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. రేవంతా.. మజాకా..

Related News

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

KTR : కోర్టు తీర్పుతో భయం.. కాంగ్రెస్ అంటేనే డ్రామాలమయం

Kakani Vs Somireddy: కాకాణి VS సోమిరెడ్డి‌.. రూ.100 కోట్ల లొల్లి

Russia-Ukraine war: మోడీ దెబ్బ.. వెనక్కి తగ్గిన పుతిన్.. యుద్దం ఆగినట్లేనా!

KCR Silent: నోరు మెదపని కేసీఆర్.. బయటపడ్డ అసలు కుట్ర!

 YS Jagan: పెద్దిరెడ్డిని సైడ్ చేసిన జగన్.. పుండు మీద కారం

Hindi: హిందీ హమారా.. హిందుస్థాన్ హమారా

Big Stories

×