Pawan kalyan House: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో ఓ వ్యక్తి హల్‌చల్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వెంటనే అలర్టయిన పోలీసులు, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు?
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర కత్తితో వ్యక్తి నానా హంగామా చేశాడు. అప్పుల బాధతో ఉన్న తనకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేయాలంటూ రెండువారాలుగా నిరసన చేస్తున్నాడు. పవన్‌ను కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈలోగా బౌన్సర్లు అక్కడికి రావడంతో వారిపై కత్తితో దాడికి యత్నం చేశాడు. ఆలోగా అందరూ రౌండప్ చేయడంతో తనను తాను గాయపరుచుకున్నాడు సదరు వ్యక్తి.
అప్రమత్తమైన బౌన్సర్లు ఆ వ్యక్తి నుంచి కత్తిని లాక్కొని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి పేరు సుచేతన్ ఠాకూర్ నాయక్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం ఖమ్మం పట్టణానికి చెందినవాడు. వృత్తి రీత్యా బిల్డర్ కూడా. తన సమస్యలతో కూడిన ఫ్లెక్సీతో పవన్ ఇంటి వద్ద ఆందోళన చేయడం కలకలం రేపింది. గౌరవనీయులైన పవన్ కల్యాణ్ అంటూ ఫ్లెక్సీని ఏర్పాడు చేశాడు.
16 రోజుల నుంచి ఖమ్మం, మంగళగిరి నుంచి హైదరాబాద్ అని రాసి ఉంది. వన్ హోప్.. టు మీట్ యు అని రాశాడు. తాను అప్పుల బాధలో కూరుకుపోయానని ప్రస్తావించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విషయం.. మంగళగిరిలో ఉన్న పవన్ కు తెలిపినట్టు సమాచారం. దీనిపై ఆయన ఈ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు