BigTV English

Revanth Reddy : ఎమ్మెల్సీ కవితకు ప్రవళిక ఆత్మఘోష వినిపించడం లేదా?.. రేవంత్ సూటి ప్రశ్న..

Revanth Reddy : ఎమ్మెల్సీ కవితకు ప్రవళిక ఆత్మఘోష వినిపించడం లేదా?.. రేవంత్ సూటి ప్రశ్న..

Revanth Reddy : గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్యపై బీఆర్ఎస్‌ నేతలు స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఆత్మ ఘోష వినబడటం లేదా? అంటూ ప్రశ్నించారు . ఆడబిడ్డల హక్కులు రాజకీయ అంగడి సరుకే తప్ప… మానవీయ ఎజెండాలు కాదన్నారు.


ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ఆత్మహత్య కాదు.. యువత కలలు, వారి ఆశలు, ఆశయాల హత్య అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరుద్యోగంతో తెలంగాణ యువత ఇబ్బందులు పడుతుందని.. గత పదేళ్లలో BJP, BRS తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తుందని.. ఒక నెలలో UPSC తరహాలో TSPSCని పునర్వ్యవస్థీకరిస్తుందన్నారు. అంతేకాదు ఒక ఏడాదిలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ పోస్టులను కాంగ్రెస్ భర్తీ చేస్తుంది.. ఇది తమ హామీ అన్నారు రాహుల్ గాంధీ.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×