BigTV English

Times Square: అమెరికాలోనే కాదు.. తెలంగాణలో కూడా టీ స్క్వేర్!

Times Square: అమెరికాలోనే కాదు.. తెలంగాణలో కూడా టీ స్క్వేర్!

T Square in Hyderabad(Telangana today news): అమెరికాలో న్యూయార్క్‌సిటీలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఇది వాణిజ్య ప్రాంతమే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కూడా. ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ కూడా. చుట్టూ బిల్లుబోర్డులే. అందులో నిత్యం వాణిజ్య ప్రకటనలు. అయినా ఆ వీధి అంతా కోలాహలంగా, సందడిగా ఉంటుంది. వీధంతా జనాలు వీడియో కాల్స్, సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు తమ ప్రకటనలు కూడా అక్కడ వేసుకుంటూ ఆనందపడుతుంటారు. బిజీ బిజీ లైఫ్‌కు చిన్న ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ సేద తీరుతుంటారు. ఉల్లాసంగా గడుపుతుంటారు. ఇలాంటిదే మన తెలంగాణలో కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.


అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ స్క్వేర్ పేరుతో ఐకానిక్ నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 9వ తేదీ వరకు బిడ్‌లను సమర్పించడానికి వీలు కల్పించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని ప్రతిపాదించింది.

మధ్య, దిగువ తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. రోజువారి పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టీ స్క్వేర్‌లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. టీ స్క్వేర్ రాజధాని నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సినిమాల అప్‌డేట్లు, సెలెబ్రిటీల బర్త్‌‌డేలు టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించేవాళ్లు, సెలెబ్రేట్ చేసుకునేవాళ్లు. ఇప్పుడు ఈ టైమ్స్ స్క్వేర్ ఇప్పుడు హైదరాబాద్‌లోనే నిర్మించతలపెడుతున్నారు.


Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×