E-Paper
Advertisement

బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా.. ఆ భూమి మునిగితే ముక్కు నేలకు రాస్తా: ఈటల సవాల్

బ్లాక్ మెయిల్ కోసమే హైడ్రా.. ఆ భూమి మునిగితే ముక్కు నేలకు రాస్తా: ఈటల సవాల్
Advertisement

Etela Rajender: స్వేచ్ఛ బ్యూరో: రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకునే దిక్కు లేదు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ.. భారత్ సమ్మిట్ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను హైదరాబాద్ గడ్డ మీదకు పిలుచుకొస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

Advertisement

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ ను వ్యతిరేకిస్తున్న వారందరినీ తీసుకొచ్చి దేశాన్ని అస్థిరపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ఐదేళ్లు కూడా అవినీతి లేని నీతివంతమైన పాలన అందించలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

ప్రభుత్వానికి ఈటల సవాల్..

Advertisement

హైడ్రా బ్లాక్ మెయిల్ కోసం వచ్చిందని, పేదలను భయపెట్టడానికి హైడ్రా వచ్చిందని విమర్శించారు. తన పార్లమెంట్ పరిధిలోని దూలపల్లి, ఫాక్స్ సాగర్(సర్వే నంబర్లు 121, 124, 125, 126) వద్ద 1995లో 406 ప్లాట్లుగా చేసి, ఎల్ఆర్ఎస్ అనుమతులు, కోర్టు స్టేలు ఉన్న చిన్న ఉద్యోగులు, టీచర్ల ఇళ్లను కమిషనర్ రంగనాథ్ ద్వారా బుల్డోజర్లతో కూలగొట్టించడం దుర్మార్గమన్నారు. ఫాక్స్ సాగర్ భూమి ఒక్క ఇంచు మునిగినా, పట్టా భూమి కాకపోయినా, 1995లో అనుమతులతో కట్టుకోకపోయినా తాను ముక్కు నేలకు రాస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి ఈటల సవాల్ విసిరారు.

గజం లక్ష పలికే చోట రూ.22 వేల పరిహారమా?

నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతులిచ్చి బిల్డర్లతో కుమ్మక్కైన లెక్కలు బయటపెడతామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు 2.5 నుంచి 3 రెట్లు పరిహారం ఇవ్వాలే తప్ప గజం రూ.లక్ష పలికే చోట రూ.22 వేలు ఇస్తామనడం అన్యాయమని, హైకోర్టు జడ్జీలు సైతం స్పందించి సామాన్యులకు రక్షణ కవచంగా నిలవాలని కోరారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.

Also Read: పబ్‌జీలో కలిశారు.. మూడేళ్లు ప్రేమించుకున్నారు.. కట్ చేస్తే గెస్ట్ హౌస్‌లో..

Tags

Related News

మూడు నెలల్లో సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం తెలుగు వెర్షన్!

తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!

ప్రేమ కాటుకు బలైన సుస్మిత.. మృతదేహానికి చెట్టుతో పెళ్లి.. అసలేం జరిగిందంటే?

పెళ్లి పేరుతో అత్యాచారం.. ముంబై మహిళ ఫిర్యాదు, హైదరాబాద్‌లో కేసు నమోదు

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

హైదరాబాద్‌ సిటీలో అగ్నిప్రమాదం.. మంటల్లో ఐదు ట్రావెల్స్ బస్సులు! తగలబెట్టిందెవరు?

Big Stories

Advertisement
×