E-Paper
Advertisement

పాలమూరు ప్రాజెక్టులకు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కీలక సూచనలు ఇవే!

పాలమూరు ప్రాజెక్టులకు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కీలక సూచనలు ఇవే!
Advertisement

Irrigation Projects: స్వేచ్ఛ బ్యూరో: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు సాగునీటి ప్రాజెక్టును వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు సీఎం ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం చెప్పారు.

Advertisement

జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

Also Read: బండి భగీరథ్ కేసులో మరో సంచలనం.. జడ్జిపై ట్రోలింగ్‌ వ్యవహారంలో రంగంలోకి ‘సిట్’!

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×