
Revanth Reddy latest speech(Today news paper telugu) : అమెరికాలో జరుగుతున్న తానా సభలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను రేవంత్‌ను వేర్వేరుగా చూడొద్దన్నారు. తాను ప్రతి నిమిషం పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలని ఉందన్న రేవంత్‌రెడ్డి.. అవకాశమిస్తే చేసి చూపిస్తానని తెలిపారు. ఎప్పటికైనా అమరావతి, పోలవరం కట్టేది కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు.
దళితులు, ఆదివాసీలను సీఎం చేయరా అని ఎన్నారైలు ప్రశ్నించగా దళితుడ్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన ఘనత తమదే అని అన్నారు. సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలని ఎన్నారైలు కోరారు. అయితే ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే విధానం కాంగ్రెస్‌లో లేదన్నారు రేవంత్‌రెడ్డి. ఈసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మనందరిపైనా ఉందని ఎన్నారైలకు సూచించారు. రేవంత్ మాట్లాడుతుండగా ఎన్నారైలు నినాదాలతో హోరెత్తించారు. రేవంత్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రేవంత్ అని నినదించారు.
దేశ రాజకీయాలపై రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తర, దక్షిణ భారత దేశాలను బ్యాలెన్స్ చేసేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రధాని ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి ఉంటే.. దక్షిణ భారత దేశానికి చెందిన వ్యక్తి రాష్ట్రపతిగా ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం ఉత్తర భారత్‌లోనూ గుజరాత్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. మాకు ఇద్దరు, మేము ఇద్దరం అన్నట్లు అదానీ అంబానీ, మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని పైరయ్యారు రేవంత్‌రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. లేఅవుట్లు వేస్తున్నప్పుడే నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలా లేఅవుట్లలో ఇళ్లు కట్టుకున్న తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేయబోమన్నారు. ధరణిలో తప్పులు సరిచేసుకోవాలంటే కలెక్టర్లకు 30 శాతం కమిషన్ ఇవ్వాల్సి వస్తోందని రేవంత్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న నిజాం ఆస్తులకు కొత్తకొత్త యజమానులను తయారు చేసి అమ్ముకుంటున్నారని రేవంత్ ఫైరయ్యారు.
తానా సభలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. వారి ఆదరణ ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయాలు చాలా అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు క్రీయాశీలక పాత్ర పోషించాలని కోరారు.
Gautam Adani : ఆ ముగ్గరి వల్లే అభివృద్ధి.. విమర్శలకు అదానీ కౌంటర్..