BigTV English

Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : బీజేపీ కోసమే బీఆర్ఎస్.. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే ఆ పార్టీల లక్ష్యం : రేవంత్

Revanthreddy : కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎంఐఎం, ఆప్ పార్టీల మాదిరిగానే జాతీయ స్థాయిలో మూడో పార్టీగా కేసీఆర్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలనుకుంటోందని ఆరోపించారు. దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గండి కొట్టాలని బీజేపీ ప్లాన్ వేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌.. బీఆర్ఎస్ గా మారడం వెనుక కుట్ర ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. బీఆర్ఎస్ ఏర్పాటుపై అభ్యంతరం తెలపడానికి ఢిల్లీలో ఐదు రోజులు వెయిట్ చేశానన్నారు. అయినా ఎన్నికల ప్రధానాధికారి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. దీంతో రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఎన్నికల అధికారికి కూడా ఆన్ లైన్ లో కంప్లైంట్ చేశానని అన్నారు.


గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో మోదీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుకూల మీడియా మోదీ ఓటమిని చిన్నగా చూపించిందన్నారు. మోదీకి ఓటమి లేదు అనుకుని విర్రవీగే వారికి ఈ ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ప్రజలే వద్దనుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటమి పాలైందని చెప్పారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ మెగా రక్తదాన శిబిరం, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద బీమా ఇస్తున్నామన్న ఆయన.. నేడు 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావేత్ తోపాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు సోనియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×