Land Seized: హైదరాబాద్ షేక్ పేట్ లో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 102/1లో 3 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తేల్చారు. 3 ఎకరాల స్థలంలో ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థలం సొసైటీది అని ప్రైవేట్ వ్యక్తులు చెబుతున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయని, కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏసీబీ కార్యాలయం ఎదుట.. ఉన్న భూమి ప్రభుత్వ భూమి అంటూ.. శనివారం 12.30 గంటల సమయంలో.. షేక్ పేట్ ఎమ్ఆర్వో సర్వే అధికారులు వచ్చి 102/1 సర్వే నెంబర్‌లో ఉన్న మూడు ఎకరాలు ప్రభుత్వ భూముల చుట్టూ కంచె వేశారు.
గత కొన్ని సంవత్సరాల నుంచి వివాదాల్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులు.. కబ్జా చేసిన ప్రభుత్వ భూములను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిన్నటిని గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు.
శనివారం నాడు సర్వే అధికారులు వచ్చి.. 102/1 సర్వే నెంబర్ మూడు ఎకరాల రెండు గుట్టల వరకు గుర్తించిన అధికారులు.. ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పి నోటీస్ బోర్డును కూడా పెట్టారు. ఎవరైనా డిటైల్స్ కోసం కావాలని అంటే కాంటాక్ట్ నెంబర్లను కూడా పెట్టారు.
కాగా.. హైడ్రా ప్రారంభించాక హైదరాబాద్‌లో అతిపెద్ద ఆపరేషన్ జరుగుతోంది. ఏకంగా 2 వేల కోట్ల రూపాయల విలువైన భూముల్లో హైడ్రా కూల్చివేతలు జరిగాయి. ఇటీవల హైదరాబాద్ వనస్థలిపురంలో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ.. ఇంజాపూర్‌లోని ప్రధాన రహదారిని ఆక్రమించి.. నిర్మాణాలు చేసింది. దీంతో కాలనీవాసులు హైడ్రాను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన హైడ్రా.. స్కూప్ ఐస్‌క్రీమ్ కంపెనీ చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
అనుమతి లేని లే- ఔట్ తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు సాగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. హఫీజ్ పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. ఆక్రమణదారులపై పోలీసు కేసులు నమోదు చేయించారు హైడ్రా అధికారులు.
హఫీజ్ పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి బోర్డుల ఏర్పాటుహైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో మొత్తం 39 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తేల్చింది హైడ్రా. ఇందులో 19 ఎకరాల్లో భారీ అపార్ట్‌మెంట్లు, విల్లాలను గతంలోనే నిర్మించారు. 17 ఎకరాల పరిధిలోని తాత్కాలిక నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. దీంతో.. ఆల్రెడీ నిర్మించిన అపార్ట్‌మెంట్లు, విల్లాల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.
Also Read: జపాన్‌లో సీఎం రేవంత్ బృందం బిజీ బిజీ.. నేడు కీలక ఒప్పందాలు!
హైడ్రా కూల్చివేతలతో మరోమారు నగరంలో కలకలం చెలరేగింది. దీంతో ఇటు హైడ్రా అటు కూల్చివేత బాధిత వర్గాల మధ్య తీవ్ర వాదోప వాదాలు చెలరేగాయి. మరీ ముఖ్యంగా వసంత హౌస్ సంస్థకు సంబంధించి ఒక రగడ చెలరేగింది.