Viral Video: మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అగ్నిసాక్షిగా కట్టిన తాళిని ఎగతాళి చేస్తున్నారు కొందరు మహిళలు. ఫలితంగా భర్తలు ఈ లోకాన్ని విడిచిపెట్టడం లేదంటే దూరంగా ఉండడం జరుగుతోంది. తాజాగా నడిరోడ్డుపై భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అతగాడికి భూమి మీద నూకలు ఉండడంతో బతికి బయటపడ్డాడు. ఏం జరిగింది? ఎక్కడ అనే డీటేల్స్‌లోకి వెళ్తే ముందు..
ఏం జరిగింది, ఎలా జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీలో చిన్న పల్లెటూరుకి చెందిన అనిల్ పాల్-రజనీ దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వీరి సంసారం తాపీగా సాగింది. ఆ తర్వాత కలతలు మొదలయ్యాయి. చివరకు అనిల్ తన ఇంట్లో స్టేషనరీ షాప్ నిర్వహిస్తున్నాడు. మధ్య మధ్యలో చిన్న గొడవలు జరిగేవి. ఇంతవరకు స్టోరీ బాగానే సాగింది.
భర్తతో గొడవ పడి తరచుగా పుట్టింటికి వెళ్లేది భార్య రజనీ. అలా ఎందుకు వెళ్తుందో భర్తకు తొలుత అర్థం కాలేదు. పొరుగున ఉంటున్న మంగళ్‌సింగ్ కుష్వాతో రజినీకి పెళ్లి ముందు నుంచి పరిచయం ఉందని భావించాడు. ఆ తర్వాత అనిల్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం భార్యాభర్తల మధ్య తగాదాలకు దారి తీయడం మొదలైంది.
అనుమానం నిజమైంది?
మార్చి 20న ఆరోగ్యం సరిగా లేదని భర్తతో చెప్పి ఆసుపత్రికి వెళ్లింది రజనీ. సాయంత్రం ఆరు గంటలు అవుతున్నా రజినీ ఇంటికి రాలేదు. భార్య కోసం వెతకడం ప్రారంభించాడు భర్త. చివరకు ఝాన్సీ రోడ్‌లోని బస్టాండ్ వద్ద ప్రియుడు కుష్వాతో కలిసి కారులో ఉంది రజనీ. వీరిని కళ్లతో చూశాడు అనిల్. పట్టరాని కోపంతో కారుని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
ALSO READ: వృద్దుడ్ని ఈడ్చుకెళ్లి.. చెంప ఛెళ్లుమనిపించిన డాక్టర్
ప్రియుడితో కలిసి నడిరోడ్డుపై స్కెచ్
చివరకు ప్రియుడితో కలిసి కారుతో భర్తను చంపాలని ప్లాన్ చేసింది. కారు కింద పడిన అనిల్‌కు గాయలు అయ్యాయి. ఈ సన్నివేశాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. అనిల్‌ను ఆసుపత్రికి తరలించారు. దీన్నిహిట్ అండ్ రన్ కేసుగా పొలీసులు భావించారు. అనిల్ కోలుకున్న తర్వాత స్టేషన్‌కు వెళ్లి జరగినదంతా చెప్పాడు.
ప్రియుడితో కలిసి భార్య.. తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని కంప్లైట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటన తర్వాత రజినీ, ఆమె ప్రియుడు మంగళ్‌సింగ్ పరారీ అయ్యారు. ఆదివారం రజినీ, ఆమె ప్రియుడును అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు దానిపై ఓ లుక్కేద్దాం.
Here's another Honda Sherni#Gwalior, Rajasthan: Anil Pal was rammed over with a car and dragged for few meters in an attempt to kill him by his wife Rajni Pal and her Boyfriend Mangal Singh Kushwaha in Gwalior's Taraganj area on March 20, when he tried to stop them.
Anil and… pic.twitter.com/lnqgzHJTO7
— Saba Khan (@ItsKhan_Saba) March 28, 2025