E-Paper
Advertisement

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
Advertisement

Road Accident: అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతిచెందారు.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు మృతిచెందారు. కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6) , కూతురు అత్త సునీత చనిపోగా.. అల్లుడు రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడుకి గాయలయ్యాయి. దీంతో షాద్ నగర్ నియోజకవర్గంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో కారును ప్రగతి రెడ్డి భర్త రోహిత్ రెడ్డి నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు.

Advertisement

కారు, ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్ దంపతులు 15 ఏళ్ల నుండి అమెరికాలో నివాసం ఉంటున్నారని బంధువులు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలినికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయ రహదారిపై… ఆర్టీసీ బస్సును కారు డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహబూబ్ నగర్ పట్టణం ప్రేమ్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు పోలీసులు.

Advertisement

Also Read: భర్తను వేధించిన భార్య, ఆపై సూసైడ్, ఏం జరిగింది?

మరోవైపు ఆసిఫాబాద్ జిల్లా కోసిని గ్రామంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ముగ్గురిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గ్రామ‌ సమీపంలోని కనకదుర్గ రైస్ మిల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×