Hot Water Bath: వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ప్రయోజనకరం. ఇది విని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎండాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే.. మీ అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చనేది నిజం. కానీ దీనికి మీరు సరైన సమయం, పద్ధతిని తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మీరు ప్రయోజనం పొందగలరు. ముఖ్యంగా రాత్రి పూట వేడి నీటితో స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది. అంతే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలు, సరైన మార్గం గురించిన పూర్తి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు :
వేడి నీటి స్నానం వల్ల మంచిగా నిద్ర వస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి తగ్గుతుంది. కండరాల సడలింపు కూడా జరుగుతుంది.
వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.
వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
వేడి నీటి స్నానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలసటను తొలగిస్తుంది.
నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
స్నానం చేయడానికి నీరు ఎంత వేడిగా ఉండాలి ?
నీటిని 37°C నుండి 40°C మధ్య వేడి చేయాలి. దీని కంటే వేడి నీటితో స్నానం అస్సలు చేయకూడదు. మీ చర్మం ఆ నీటిని తట్టుకోగలదా అని సాధారణంగా టెస్ట్ చేయండి. నీరు చాలా వేడిగా ఉంటే మీరు దానితో స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. చర్మం తట్టుకునే మోతాదులోనే నీటిని వేడి చేసుకుని స్నానం చేయాలి. నీరు ఎక్కువ వేడిగా ఉంటే అందులో కాస్త చల్లటి నీరు కలిపి స్నానానికి ఉపయోగించాలి. కానీ ఎక్కువ వేడిగా ఉన్న నీటితో అస్సలు స్నానం చేయడకూడదు.
వేసవిలో వేడి నీటితో స్నానం చేయడం ఎప్పుడు మంచిది ?
వేసవిలో వేడి నీటితో స్నానం చేయడానికి సరైన సమయాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. ఉదయం ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేయకూడదు. పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల మీకు మంచి నిద్రగా వస్తుంది. అలసట కూడా తగ్గుతుంది. కాబట్టి.. రాత్రి పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయండి.
వేడి నీటి స్నానం తర్వాత ఏమి చేయకూడదు ?
వేడి నీటి స్నానం తర్వాత పరిగెత్తడం లేదా నడవడం చేయకూడదు.
స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ఉండండి.
Also Read: ఉల్లిపాయ రసంలో ఈ 2 కలిపి రాస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
ఫోన్, టీవీ మొదలైన వాటిని వాడకూడదు.
స్నానం చేసిన తర్వాత.. మంచి పుస్తకం చదవండి. ఇది మీరు బాగా నిద్రపోవడానికి ఇది సహాయపడుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత.. మీరు నేరుగా మీ పడకగదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు.
మీరు స్క్రీన్ సమయం భారం ఎక్కువగా పడినా కూడా.. దాని వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లభించదు.