E-Paper
Advertisement

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా
Advertisement

Murasu Cyclone: అర్నబ్ తుఫానుతో అతలాకుతలమైన ఏపీకి మరొక ‘మురసు’ ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మంగళవారం ఇది ఏపీ తీరం దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలను అలర్ట్ చేశారు అధికారులు.

ఏపీ వైపు దూసుకు వస్తున్న ‘మురసు’ తుఫాన్

అర్నబ్‌ ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు ఓ కుదుపు కుదిపేసింది. కనీవినీ ఎరుగని నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు బలమైన ఈదురు గాలులు తోడు కావడంతో భారీ సంఖ్యలో చెట్టలు నేలమట్టం అయ్యాయి. లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయి. ఇంకా ఈ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరొక తుఫాను ‘మురుసు’ ఏపీ పైకి దూసుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో.. గంటకు 23 కిలోమీటర్ల వేగంగా కదులుతోంది.

గంటలకు 23 కి.మీ. వేగంతో కదులుతున్న తుఫాన్

Advertisement

ప్రస్తుతం చెన్నైకి 700 కి. మీ, విశాఖకు 770 కి. మీ, మచిలీపట్నానికి 770 కి. మీ, ఒంగోలుకు 810 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం మరో 6 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం మురసు తుపానుగా నెల్లూరు-నరసాపురం మధ్య దక్షిణ కోస్తా తీరాన్ని దాట వచ్చని భావిస్తున్నారు.

తుఫాను తీరం దాటే సమయంలో గంటలకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్నారు. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు సూచన చేశారు. మురసు ప్రభావంతో రానున్న3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు ఆదివారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

Advertisement

ALSO READ: హిందూపురంలో సతీమణితో బాలకృష్ణ ప్రత్యక్షం.. ఓటు హక్కుపై కీలక వ్యాఖ్యలు!

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. మురసు తుఫాను ప్రభావం తెలంగాణపై పడే అవకాశం ఉంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చల్లటి గాలులు వీయడం మొదలైంది. ఆదివారం లేకుంటే సోమవారం నుంచి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆ శాఖ అధికారులు.

Related News

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు

2029లో తెలుస్తుంది అసలు సినిమా! ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయంటే.?- పేర్ని నాని

హిందూపురంలో సతీమణితో బాలకృష్ణ ప్రత్యక్షం.. ఓటు హక్కుపై కీలక వ్యాఖ్యలు!

పులివెందులలో లాఠీఛార్జ్, సీన్‌లోకి జగన్.. వినుకొండలో బొల్లా అరెస్టు, విజయవాడలో గుర్తులు తారుమారు

ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల పోలింగ్ మొదలు.. కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా పోలీసులు మోహరింపు

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు

ఏపీలో రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు!

Big Stories

Advertisement
×