E-Paper
Advertisement

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ 1నుండి వాటర్ ట్యాంకర్లు..?
Advertisement

Green Tankers: హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటంతో పాటు, అందుబాటులో ఉన్న మంచినీటిని, భూగర్భ జల వనరులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి నగరం వ్యాప్తంగా ‘గ్రీన్ ట్యాంకర్ల’ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు వెల్లడించారు. శనివారం సచివాలయంలో హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని తాగునీటి సరఫరా పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

వృథా చేయవద్దని స్పష్టం..

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తాగునీటితో సంబంధం లేని పనుల కోసం మంచినీటిని వృథా చేయవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ సంస్థలు నిర్మాణాలు, ల్యాండ్‌స్కేపింగ్, రోడ్లు/పరిసరాల శుభ్రత తదితర అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. ఇక ప్రజలకు వాటర్ బోర్డు ద్వారా అందుబాటులో ఉన్న తాగునీటి ట్యాంకర్ సేవల తరహాలోనే, శుద్ధి చేసిన నీటిని పొందేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

గ్రీన్ ట్యాంకర్లు..

Advertisement

దీని ద్వారా నగరవాసులు సులభంగా గ్రీన్ ట్యాంకర్లను బుక్ చేసుకోవచ్చు. మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా సరఫరా చేసే నీటి నాణ్యతను నిరంతరం తనిఖీ చేస్తూ, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచాలని సీఎస్ సూచించారు.రోజూ ఎంత పరిమాణంలో శుద్ధి చేసిన నీటిని రవాణా చేస్తున్నారు? ఎంత సరఫరా అవుతోందనే వివరాలను ఎంజీడీ ( మిలియన్ గ్యాలన్స్ పర్ డే) ప్రాతిపదికన నివేదిక రూపంలో అందించాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎండీని సీఎస్ ఆదేశించారు.

Also Read: నవంబర్ లో మార్కెట్లోకి కొత్త ఈవీలు.. టీవీఎస్, సుజుకి, ఓబెన్ నుంచి అదిరిపోయే మోడళ్లు!

Tags

Related News

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

ఆరో తరగతి చదువుతున్న కూతురిపై.. సవతి తండ్రి లైంగిక దాడి!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

Big Stories

Advertisement
×