E-Paper
Advertisement

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!

రామంతాపూర్ పెద్ద చెరువు వద్ద.. హైడ్రా సంచలన కూల్చివేతలు!
Advertisement

HYDRAA: మల్కాజిగిరి నగరపాలక సంస్థ రామంతాపూర్‌ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందంటూ హైడ్రా అధికారులు భారీ షెడ్డు కూల్చివేశారు. ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చేపట్టిన ఈ చర్యపై షెడ్‌ యజమాని గోవర్ధన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 47 ఏళ్ల క్రితమే భూమిని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నామని, అవసరమైన అనుమతులు పొందడంతోపాటు అప్పటి నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.

హైకోర్టును ఆశ్రయించగా..

చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్‌ హద్దులను ఖరారు చేయకుండానే, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ షెడ్డు కూల్చివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు.

రాజకీయ కారణాలతోనే..

Advertisement

కాగా, కూల్చివేసిన షెడ్డులో మల్కాజిగిరి పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డికి చెందిన మధుర బార్‌ నిర్వహణ ఉండటంతో రాజకీయ కారణాలతోనే కూల్చివేతలు చేపట్టారంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై హైడ్రా అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

Also Read: ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

Tags

Related News

అమిత్ షా మహా పాదయాత్రతో.. రాంచందర్ రావు కీలక ఆదేశాలు జారీ!

తెలంగాణకు అమిత్ షా రాక.. హైదరాబాద్‌ పర్యటనకు షెడ్యూల్ ఖరారు!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని స్పాట్‌లో వ్యక్తి మృతి!

ఎల్ నినో ఎఫెక్ట్.. మండుతున్న నిత్యావసరాల ధరలు..!

ఆరో తరగతి చదువుతున్న కూతురిపై.. సవతి తండ్రి లైంగిక దాడి!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా వదల్లేదు.. రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!

Big Stories

Advertisement
×